»   »  బెదిరించారని.. టైటిల్ మార్చారా

బెదిరించారని.. టైటిల్ మార్చారా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : మళయాళం సూపర్ హిట్ సినిమా 'బెంగుళూర్ డేస్'. ప్రస్తుతం ఈ సినిమా తమిళం, తెలుగు లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు తమిళంలో 'బెంగుళూరు నాటకాల్' గా మార్చి విడుదల చేస్తున్నారు.

మొదట ఈ చిత్రానికి ADMK (అర్జున్, దివ్య, మాత్రమ్, కార్తీక్) అని పేరు పెట్టారు. అయితే అన్నా డిఎంకే పార్టీ వారు అబ్జెక్షన్ చెప్పటంతో ...టైటిల్ మార్చారని చెప్పుకుంటున్నారు.

మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘బెంగళూరు డేస్‌'. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేస్తోంది పీవీపీ సినిమా సంస్థ. తెలుగులో పలు విజయాలను అందించిన బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం తర్వాత కోలీవుడ్‌లో పలువురు తారలు ఈ సినిమాలో కనిపించి అలరించనున్నారు. సినిమాకు ‘బెంగళూరు నాట్కల్‌'గా పేరు ఖరారు చేశారు.

‘బాహుబలి'లో తన తడాఖా చూపిన రానా, ‘జిగర్‌దండా'లో తిరుగులేని నటనతో ఆకట్టుకున్న బాబిసింహా, శ్రీదివ్య, సమంత, పార్వతి, రాయ్‌లక్ష్మి, ప్రకాశ్‌రాజ్‌.. ఇలా పలువురు అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Bangalore Days Tamil title changed

ముగ్గురు అన్నదమ్ములకు (కజిన్స్‌) సంబంధించిన కథతో దీన్ని రూపొందించారు. బెంగళూరు నగర జీవిత నేపథ్యంతో తెరకెక్కించారు. గోపీసుందర్‌ సంగీతం సమకూర్చారు. కేవీ గుహన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సాధారణ కథలకు భిన్నంగా నేటి ట్రెండ్‌కు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.

‘బెంగళూరు డేస్‌' సినిమాను చూసిన వారికి ఇప్పటికే వీరు ఏయే పాత్రల్లో ఎవరు నటించారు?.. అనే ఆసక్తి పెరిగింది. ఇక మన నేటివిటీకి ఎలా మార్పు చేస్తారోనని కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలో ఈ సినిమాను తెలుగులో తీయ్యాలని నిర్ణయించుకున్నారు, కాని ఇప్పుడు దీనిని తెలుగులో డబ్బింగ్ చెయ్యలని చూస్తున్నారు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ డైరక్టర్ కాగా, ప్రసాద్ వి పొట్లూరి నిర్మాత.

English summary
Malayalam hit film ‘Bangalore Days’ is getting re-made in Tamil and Telugu. Now the film is named as 'Bengaluru Naatkal'.
Please Wait while comments are loading...