For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తాళి కడితేనే భార్యభర్తలమా? శోభన్‌బాబుతో బంధంపై జయలలిత.. అమృత వ్యవహరంలో కొత్త ట్విస్ట్

  By Rajababu
  |
  జయలలిత-అమృత వ్యవహరంలో కొత్త ట్విస్ట్ !

  సినీ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి ఎప్పుడు మాట్లాడినా అది సంచలనం. ఆమె మరణం తర్వాత కూడా సంచలన వార్తలకు కొదువ ఉండటం లేదు. జయలలిత అవివాహిత అయినప్పటికీ ఆమెకు శోభన్‌బాబు ద్వారా కలిగిన కూతురు ఉందనే విషయం అప్పుడప్పుడు మీడియాలో వినిస్తుంది. తాజాగా తాను జయలలిత కూతుర్ని అని బెంగళూరుకు చెందిన అమృత అనే యువతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ కేసును కర్ణాటక హైకోర్టులోలో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చడంతో ఈ అంశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నది.

   పెంపుడు తల్లి సంరక్షణలో

  పెంపుడు తల్లి సంరక్షణలో

  సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అమృత పేర్కొన్న ప్రకారం.. నేను 1980 ఆగస్టు 14న జయలలిత కడుపున జన్మించాను. పెంపుడు తల్లి శైలజ సంరక్షణలో పెరిగాను. 2015లో నా పెంపుడు తల్లి మరణించింది. ఈ ఏడాది మార్చి 20న నా పెంపుడు తండ్రి కూడా మరణించాడు. జయలలిత జీవించి ఉన్నప్పడు నేను తన కుమార్తెను అని ప్రకటిస్తే ఆమె ప్రతిష్ట దెబ్బతింటుంది అని దాచిపెట్టాను అని అమృత పేర్కొన్నారు.

  జయలలితకు కూతురు వాస్తవమే

  జయలలితకు కూతురు వాస్తవమే

  సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు కర్ణాటక హైకోర్టులో దాఖలు కానున్నది. ఆదేశాల ప్రకారం కేసును దాఖలు చేయడానికి అమృత సిద్ధమవుతున్నట్టు సమాచారం. జయలలితకు బిడ్డ ఉన్న మాట వాస్తవమేనని ఆమె మేనత్త కూతురు లలిత కూడా ఇటీవల వెల్లడించడం అమృత వ్యవహారానికి బలం చేకూరింది.

   శోభన్‌బాబు, జయలలితకు పుట్టాను

  శోభన్‌బాబు, జయలలితకు పుట్టాను

  దివంగత సినీనటుడు శోభన్‌బాబు, జయలలిత దాంపత్య ఫలితంగానే తాను జన్మించానని అమృత చెబుతున్న నేపథ్యంలో జయ, శోభన్‌బాబు మధ్య బంధం మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాకుండా జయ, ఎంజీఆర్ మధ్య ఉండే సన్నిహిత సంబంధలు మరో తెరపైకి వచ్చాయి.

   మానసిక క్షోభకు గురైన జయలలిత

  మానసిక క్షోభకు గురైన జయలలిత

  జయలలిత సినీ కెరీర్‌ను ఓ సారి పరిశీలిస్తే.. ఎంజీఆర్‌తో కలిసి 28 చిత్రాల్లో నటించింది. ఎంజీఆర్, జయలలిత జంటకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. పట్టికాట్టు పొన్నయ్య అనే చిత్రంలో నటించే సమయంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. ఆ తర్వాత ఎంజీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో జయలలితను ఎంపిక చేయకుండా వేరే వారిని ఎంపిక చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దాంతో జయలలిత మనస్తాపానికి గురై మానసిక క్షోభకు గురైంది.

   శోభన్‌బాబుకు దగ్గరైన జయలలిత

  శోభన్‌బాబుకు దగ్గరైన జయలలిత

  అలాంటి పరిస్థితుల్లోనే జయలలిత తల్లి మరణించారు. దాంతో ఆమె ఒకరకమైన డిప్రెషన్‌లోకి వెళ్లారని చెప్పుకొంటారు. ఎంజీఆర్‌కి దూరమైన తర్వాత జయలలితకు సినీ అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఒంటరిగా జీవితాన్ని గడిపారనేది జగమెరిగిన సత్యం. అలాంటి సందర్భంలోనే అందాల నటుడు శోభన్‌బాబుతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనేది సినీవర్గాల వాదన.

   శోభన్‌బాబుతో ప్రేమ వ్యవహారం

  శోభన్‌బాబుతో ప్రేమ వ్యవహారం

  శోభన్‌బాబుతో ప్రేమ వ్యవహారాన్ని 1975లో ఓ ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది. దాంతో వార్తకు జయలలిత స్పందించాల్సి వచ్చిందట. శోభన్‌బాబుతో గాఢమైన అనుబంధం ఉంది. ఆ బంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నాను అని జయలలిత సదరు రిపోర్టర్‌కు వెల్లడించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

   తాళి కడితేనే భార్యభర్తల బంధమా?

  తాళి కడితేనే భార్యభర్తల బంధమా?

  ఆంగ్ల దినపత్రిక జయలలిత, శోభన్‌బాబు వార్తను తమిళ దినపత్రిక అనువదించడంతో మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా కూడా శోభన్‌బాబుతో తన రిలేషన్ పవిత్రమైనది అని చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. సదరు తమిళ వార్తా విలేఖరితో భేటీ అయిన జయలలిత.. తాళి కడితేనే భార్యభర్తల బంధం అవుతుందా అనే నిలదీసినట్టు సమాచారం.

  మరో మహిళ జీవితాన్ని నాశనం..

  మరో మహిళ జీవితాన్ని నాశనం..

  తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ వార్త వెలువడినా.. శోభన్‌బాబును సమర్ధించే వారని చెప్పుకొంటారు. శోభన్‌బాబు వివాహితుడు. ఆయన భార్యకు విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకోవడం తప్పు. ఓ మహిళ జీవితాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు అని జయలలిత స్పష్టం చేసేదట. ఇలాంటి సంఘటనలు జయ, శోభన్‌బాబు రహస్య బంధానికి బలం చేకూర్చాయి.

   శోభన్‌‌తో సన్నిహిత బంధం

  శోభన్‌‌తో సన్నిహిత బంధం

  పోయెస్‌గార్డెన్‌లో శోభన్‌బాబుకు జయలలిత భోజనం వడ్డించే ఫొటోలు, వారు అన్యోన్యంగా ఉన్న ఫొటోలతో వారి మధ్య స్నేహం కంటే బలమైన రిలేషన్ ఉందనే అందరికీ అర్ధమైంది. ఆ నేపథ్యంలో శోభన్‌బాబుతో బంధం గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. జయలలిత సీఎంగా మారిన తర్వాత అలాంటి వార్తలకు కాలం చెల్లింది.

   మరోసారి వార్తల్లో జయలలిత

  మరోసారి వార్తల్లో జయలలిత

  జయలలిత మరణం నేపథ్యంలో కూడా ఇలాంటి వార్తలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది మీడియా. శోభన్‌బాబుతో అనుబంధాన్ని మీడియా ప్రముఖంగా ప్రచురించింది. 2017లో కృష్ణమూర్తి అనే వ్యక్తి తాను శోభన్‌బాబు, జయలలితకు పెట్టానని చెప్పడం సంచలనం రేపింది. తాజాగా అమృత వ్యవహారంలో మరోసారి జయలలిత జీవితం వార్తల్లోకి ఎక్కింది. తాను జయలలిత కూతురునని చెప్పుకొంటున్న అమృత వ్యవహారం ఎక్కడికి వెళ్తుందనే విషయానికి కాలమే సమాధానం చెబుతుంది.

  English summary
  After one year of Jayalalithaa's death, a Bangalore-based woman Amrutha has claimed that she was born to the late Tamil Nadu Chief Minister. And she petitioned the Supreme Court calling for a DNA test after exhuming Jayalalithaa’s body from its resting place. The apex court dismissed the case and asked her to approach the high court. In March 2017, after Jayalalithaa’s death , a person called Krishnamoorthy had moved the Madras High Court claiming he was born to Jayalalithaa and late Telugu actor Shoban Babu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X