For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ స్టార్ కాక ముందు స్కూటర్ మెకానిక్

  By Srikanya
  |

  చెన్నై : రీసెంట్ గా తెలుగు ప్రేక్షకుల్ని 'డేవిడ్‌ బిల్లా'గా పలకరించిన తమిళ సూపర్ స్టార్ అజిత్‌ పూర్వాశ్రంలో అంటే నటన వైపు అడుగులు వేయక ముందు ఓ స్కూటర్‌ మెకానిక్‌. సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్‌ ఆ తరవాత చెన్నై వెళ్లిపోయారు. స్కూలు చదువు పూర్తయ్యాక కాలేజీ మెట్లు ఎక్కలేదు. ఓ మెకానిక్‌ దగ్గర పని నేర్చుకొన్నారు. అలా మెకానిక్‌గా కొన్నాళ్లు గడిపారు. ఆ తరవాత కారు రేసు డ్రైవర్‌గా మారారు.

  అప్పుడు చేసిన కొన్ని యాడ్ ఫిల్మ్ లోని చిన్నచిన్న వేషాలు వేషాలు అతని జీవితాన్ని ములపు తిప్పాయి. ఆ ప్రకటనల్లో చేసిన అనుభవంతోనే సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు అజిత్‌. అప్పుడు దక్కింది ఓ తెలుగు సినిమా. లక్ష్మీ ప్రొడక్షన్స్‌ సంస్థ 'ప్రేమ పుస్తకం' చిత్రం కోసం ఆయన్ని హీరోగా ఎంచుకొన్నారు. ఈ సినిమా కోసం అజిత్‌ పేరు కూడా మార్చారు... శ్రీకర్‌ అని. ఆ తరవాత మళ్లీ అజిత్‌గానే తమిళ సినిమాల వైపు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. అజిత్‌ తెలుగులో చేసిన ఏకైక చిత్రం 'ప్రేమ పుస్తకం' మాత్రమే.

  అజిత్ తాజా చిత్రం 'డేవిడ్‌ బిల్లా' విషయానికి వస్తే ...డబ్బింగ్ చిత్రమైనా ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు,బ్లాక్ లో టిక్కెట్లు అమ్మే స్ధితిలో క్రేజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమా మాత్రం అందరి అంచనాలనూ తల క్రిందులు చేస్తూ ప్లాప్ గా మిగిలింది. స్టైలిష్ నటన పేరుతో సినిమాను లాజిక్ లు లేకుండా నత్త నడకతో నడిపించటం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. గతంలో అజిత్ మంగత్తా మాదిరిగానే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కానీ స్ధితి చేరుకుంది.

  ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు తోలేటి చక్రి మాట్లాడుతూ...''గ్యాంగ్‌స్టర్‌ సినిమాల్లో లాజిక్‌, నాటకీయత కంటే...హీరో భావోద్వేగాలే కీలకం. ప్రతి సన్నివేశం కూడా స్త్టెలిష్‌గా కనిపించాలి. ఆ విషయంలో నేను, మా బృందం విజయం సాధించాం. తొలిసారి కమర్షియల్ విలువలున్న సినిమాకి అర్థమేమిటో నాకు తెలిసింది''అన్నారు . అలాగే ''ప్రతి డాన్‌కీ ఓ చరిత్ర ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన చిత్రం 'డేవిడ్‌ బిల్లా'. వాస్తవంగా 'బిల్లా'కి ప్రీక్వెల్‌ చెయ్యాలనే ఆలోచన నాది కాదు. స్వతహాగా అజిత్‌ కోరిక అది. ఆయన ఉద్దేశం నచ్చడంతో కథ సిద్ధం చేసుకొన్నాను. ఒక సామాన్య యువకుడు డాన్‌గా ఎదిగే తీరును ప్రతిబింబిస్తూ... మొదట చేతితో, తర్వాత కత్తితో, చివరికి తుపాకులతో పోరాట సన్నివేశాల్ని తీర్చిదిద్దాం అన్నారు.

  English summary
  Before stardom happened, Ajith was a mechanic. His friends cajoled him to do modeling and one thing led to the other. Ajith dropped out of Asan Memorial Sr. Sec. School in 1986 to become a part-time 2/4-wheeler mechanic and full-time garment exporter based in Erode till 1990. Business exigencies pushed him into modelling for adverts in print media which eventually paved the way into Tollywood and later into Tamil films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X