4 కాదు.. 40 పెళ్లిళ్లు చేసుకొంటా.. పవర్ స్టార్‌తో పెళ్లిఫోటోపై ఘాటుగా వనితా విజయ్ కుమార్

తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో దండలు మార్చుకొని పెళ్లి చేసుకొన్నట్టు బిల్డప్ ఇచ్చిన వనితా విజయ్ కుమార్ తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. పవర్ స్టార్‌ను మళ్లీ పెళ్లి చేసుకొన్నావా? అంటూ ట్రోల్ చేస్తున్న వారికి ఘాటుగా స్పందించారు. అయితే పికప్ అండ్ డ్రాప్ సినిమా ప్రమోషన్ కోసం ఆ ఫోటోను ట్వీట్ చేసినట్టు ఆమె స్పష్టం చేసింది. ఆ సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన ప్రెస్ మీట్‌లో వనితా విజయ్ కుమార్ మాట్లాడుతూ..

Recommended Video

Vanitha Vijayakumar, Peter Paul Marriage BREAK UP మూడో మొగుడ్ని కూడా తరిమేసిన వనితా విజయ్‌కుమార్
పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పెళ్లి ఫోటో

పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పెళ్లి ఫోటో

నేను ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. రెగ్యులర్‌గా నా షోలు, సినిమాలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నాను. ఇన్స్‌టాగ్రామ్‌, ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో చురుకుగా ఉంటాను. చిత్ర యూనిట్ కోరిక మేరకు నేను పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో ఫోటోను షేర్ చేశాను అని వనితా విజయ్ కుమార్ చెప్పారు.

పబ్లిసిటీ కోసమే ఫోటో షేర్ చేశా..

పబ్లిసిటీ కోసమే ఫోటో షేర్ చేశా..

నేను, శ్రీనివాసన్ కలిసి నటిస్తున్న పికప్ అండ్ డ్రాప్ సినిమా పబ్లిసిటీ కోసం పెళ్లి ఫోటోను షేర్ చేశాను. పబ్లిసిటీ అంటే పబ్లిసిటీనే. నాకు పవర్ స్టార్ అంటే ఇష్టం. పవర్ స్టార్ కామెడీ అంటే చాలా ఇష్టం. నేను ఆయనతో నిర్మించిన సినిమా నుంచి ఆయనతో మంచి పరిచయం ఉంది. ప్రమోషన్ కోసం ఆ కాన్సెప్ట్‌ను ఒప్పుకొన్నాను అని వనితా విజయ్ కుమార్ పేర్కొన్నారు.

పికప్ అండ్ డ్రాప్‌లో

పికప్ అండ్ డ్రాప్‌లో

పికప్ అండ్ డ్రాప్ సినిమాలో నేను కామెడీ రోల్ చేస్తున్నాను. నా కెరీర్‌లో నేను ఎప్పుడూ కామెడీ రోల్ చేయలేదు. ఆ పాత్రలో మెప్పిస్తాననే నమ్మకం నాకు ఉంది. పెళ్లి సీన్లు తీస్తున్నప్పుడు మా ఇద్దరి పెళ్లి జరిగినప్పుడు ఆ ఫోటోను తీశారు. ఆ ఫోటో వైరల్ కావడంతో మేము ఆశించిన ప్రమోషన్ జరిగింది అని వనితా విజయ్ కుమార్ తెలిపారు.

నయనతార అంటే నాకు ఇష్టం

నయనతార అంటే నాకు ఇష్టం

సినీ రంగంలో పెళ్లి చేసుకొన్న తర్వాత కూడా రాణించవచ్చని చాలా మంది నిరూపించారు. ఏ రంగంలోనైనా రాణించడానికి మహిళలకు ధైర్యం ఉండాలి. అప్పుడే హింస, లైంగిక వేధింపులు లాంటిని తట్టుకొని అధిగమిస్తారు. ఆ విషయంలో నాకు నయనతార ఆదర్శం. అందుకే ఆమె సూపర్ స్టార్ అయింది. ఆమెను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది అని అన్నారు.

అందుకే మహిళలు సూసైడ్

అందుకే మహిళలు సూసైడ్

మహిళలకు వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛ ఉండాలి. పురుషులు నాలుగు, ఐదు పెళ్లిళ్లు చేసుకొన్నా ఎవరూ మాట్లాడరు. వాళ్లను తప్పుపట్టారు. అదే మహిళలైతే వారిని వెంటాడుతుంటారు. అందుకే మహిళలు సూసైడ్స్ చేసుకొంటున్నారు. అవసరమైతే నేను నాలుగు కాదు 40 పెళ్లిళ్లు చేసుకొంటాను. నా జీవితం నా ఇష్టం. జీవితంలో నాకు ఆ ధైర్యం ఉంది అంటూ వనితా విజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు.

పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు...

పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు...

అయితే ప్రస్తుతం నా వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు. నేను ఇలా మాట్లాడుతుంటే.. నన్ను ఏదో ఆధ్యాత్మిక గురువు అనుకోవద్దు. నా జీవితంలో పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలను కనడం, ఆ తర్వాత నేను సినిమా పరిశ్రమకు దూరం కావడం నేను చేసిన చాలా పెద్ద తప్పు. సినిమాల నుంచి తప్పుకొంటే రాజకీయాల్లోకి ప్రవేశిస్తాను అని వనితా విజయ్ కుమార్ తన భవిష్యత్ కార్యాచరణను తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X