»   »  'బికినీ' నా... నో!

'బికినీ' నా... నో!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nayantara
రోజురోజుకీ బికినీల క్రేజ్ బాలీవుడ్ లోనే కాక,టాలీవుడ్,కోలీవుడ్ లలో పెర్గిపోతోంది. వారు చూపెడుతున్నారని ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారో...లేక ప్రేక్షకులు చూస్తున్నారని భామలంతా బికినీలు కట్టటానికి రెడీ అవుతున్నారో తెలియని పరిస్ధితి నెలకొంది.

దాంతో వెండితెరపై సంప్రదాయ చీరకట్టులో కనిపించి అలరించే ముద్దుగుమ్మలు సైతం వున్నట్లుండి బికినీలతో కనిపించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య అజిత్ చిత్రం 'బిల్లా'లో నయనతార టూపీస్ వస్త్రాలతో కనిపించి కుర్రకారు గుండెల్లకు గేలం వేయటం అందరినీ ఆలోచింప చేసింది. బికినీ సన్నివేశంలో అందాలను ఆరబోసిన నయనతారను మళ్లీ అటువంటి సన్నివేశాలలో నటింపచేయటానికి కొందరు నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారుట.

అయితే నయనతార మాత్రం తాను ఇక బికినీలో దర్శనమిచ్చేది లేదనీ తెగేసి చెపుతోంది. ఒకసారి ప్రేక్షకులకు 'అలా' కనిపించాననీ, వారి నుంచి మంచి స్పందన వచ్చిందనీ... మరోసారి ఇటువంటి పాత్రను చేయబోననీ అంటోంది. ఇక నడుమందాల శ్రియ ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన బికినీ ఫోజులు సంచలనం సృష్టించాయి. ఈ ఫోటోలు శ్రియకు కొత్త ఆఫర్లు తెచ్చినట్లు కోలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు.అయితే నయనతార లోటు శ్రియ తీరుస్తుందనేగా ....

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X