»   » తల్లిదండ్రులు నో....హీరో, హీరోయిన్ ప్రేమ వివాహం దిశగా!

తల్లిదండ్రులు నో....హీరో, హీరోయిన్ ప్రేమ వివాహం దిశగా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ యాక్టర్ బాబీ సింహా, హీరోయిన్ రెష్మి మీనన్ త్వరలో వివాహ బంధం ద్వారా ఏకం కాబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరు 2016లో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయం త్వరలో అఫీషియల్‌గా ఖరారు కానుంది.

వీరి వివాహానికి ఇరుకుటుంబాల వారు బలవంతంగా అంగీకారం తెలిపారని తెలుస్తోంది. ఆగస్టు నెలలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరుగనుంది. 2016 జనవరిలో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

Bobby Simhaa, Reshmi Menon to tie the knot in January 2016

బాబీ సింహా, రేష్మి మీనన్ గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. వారు కలిసి నటిస్తున్న ‘ఉరుమీన్' అనే తమిళ సినిమా షూటింగ్ మొదలయినపుడే వీరి మధ్య ప్రేమ పుట్టింది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

వాస్తవానికి రేష్మి మీనన్ తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేదట. అయితే ఇద్దరూ సీరియస్ గా ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకోవడంతో చేసేది ఏమీ లేక ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై ఇటు బాబీ సింహా కానీ, అటు రేష్మి మీనన్ కానీ స్పందించలేదు.

English summary
National Award winning Tamil actor Bobby Simhaa and Reshmi Menon, who have been secretly seeing other over the last few months, are said to be planning to get married in January 2016.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu