»   » సంఘమిత్రలో సెక్సీ హీరోయిన్.. శృతి స్థానంలో ఆమెనా? షాకులపై షాక్..

సంఘమిత్రలో సెక్సీ హీరోయిన్.. శృతి స్థానంలో ఆమెనా? షాకులపై షాక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అందాల తార శృతీహాసన్ తప్పుకున్న తర్వాత సంఘమిత్ర ప్రాజెక్ట్ అటకెక్కినట్టే అనే రూమర్లు తమిళ చిత్ర పరిశ్రమలో తెగ ప్రచారం అయ్యాయి. అలాంటి రూమర్లకు తెరదించే ప్రయత్నాన్ని చిత్ర దర్శకుడు సుందర్ సీ, ఆయన భార్య, ప్రముఖ నటి ఖుష్బూ చేశారు. సంఘమిత్ర చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమలోనే గతంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్ రూపొందిస్తున్న సంఘమిత్ర చిత్ర షూటింగ్ ప్రారంభానికి ముందే అనేక వివాదాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.

  తొలుత శృతిహాసన్

  తొలుత శృతిహాసన్

  సంఘమిత్ర ప్రాజెక్ట్ ఫస్ట్‌లుక్‌ను ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ కేన్స్ ఫెస్టివల్‌లో అట్టహాసంగా దర్శకుడు సుందర్ సీ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సంఘమిత్రగా శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. తన పాత్ర కోసం ఓ నెలపాటు లండన్‌లో కత్తిసాము, గుర్రపు స్వారీ లాంటి అంశాలలో శృతి శిక్షణ పొందింది.

  ఆ తర్వాత వైదొలిగిన..

  ఆ తర్వాత వైదొలిగిన..

  అయితే అనుకోకుండా ఈ చిత్రం నుంచి తప్పుకొంటున్నానని శృతి ప్రకటించండం తమిళ చిత్రపరిశ్రమలో ప్రకంపనలు పుట్టాయి. సంఘమిత్ర చిత్ర స్క్రిప్టు ఇంకా పూర్తి కాలేదు. ఈ చిత్రం కోసం మరో రెండేళ్లు నా కెరీర్‌ను పణంగా పెట్టలేను. నా పాత్రపై నాకే క్లారిటీ లేదు అనే ఆరోపణలు చేస్తూ శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది.

  హన్సిక పేరు పరిశీలనలో

  హన్సిక పేరు పరిశీలనలో

  సంఘమిత్ర నుంచి అనూహ్యంగా తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం మరో బ్యూటీ హన్సికను ఎంపిక చేశారు అని వార్తలు వచ్చాయి. కానీ సినిమా గురించి ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో సంఘమిత్ర అటకెక్కిందనే గాసిప్స్ వెలుగుచూశాయి. ఇలా సినిమా పని ఖతమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

  దిశా పటానీ ఎంపిక

  దిశా పటానీ ఎంపిక

  ప్రస్తుతం సంఘమిత్ర పాత్ర కోసం బాలీవుడ్ తార దిశా పటానీని ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ నుంచి షూటింగ్‌కు వెళ్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దిశా పటానీని సంఘమిత్ర పాత్ర కోసం ఎంపిక చేశామని అధికారికంగా ప్రకటన వెలువడలేదు. కానీ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుందని ట్విట్టర్‌లో కుష్బూ ప్రకటనలో చేసింది.

  ప్రకటించకపోవడంపై సందేహాలు

  ప్రకటించకపోవడంపై సందేహాలు

  దిశా పటానీ ఎంపిక పూర్తయినప్పటికీ.. అధికారికంగా ప్రకటించకపోవడంపై అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే త్వరలోనే ఆమె ఎంపికను అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంటున్నది. ఈ చిత్రం శ్రీ థెనాండల్ స్టూడియో బ్యానర్‌పై తెరకెక్కనున్నది. బాహుబలి తర్వాత దక్షిణాదిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న చిత్రంగా సంఘమిత్ర విడుదలకు ముందే మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది.

  ఏఆర్ రెహ్మాన్ సంగీతం..

  ఏఆర్ రెహ్మాన్ సంగీతం..

  సంఘమిత్ర చిత్రంలో ఆర్య, జయం రవి కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు.

  English summary
  Sangamithra, the magnum opus from filmmaker Sundar C, will roll from December. Many had feared that the film had been shelved after Shruti Haasan walked out of the film. According reports, the makers have signed Disha Patani as a replacement to Shruti Haasan, and the project is set to roll from December. Actress-politician Khushbhu Sundar, wife of Sundar C, on Sunday confirmed the project will roll from December.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more