»   » లింగా: రజనీకాంత్‌తో బ్రిటిష్ బ్యూటీ (ఫోటోలు)

లింగా: రజనీకాంత్‌తో బ్రిటిష్ బ్యూటీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా 'లింగా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా లింగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 'లింగా'లో బ్రిటిష్ నటి, సింగర్ లారెన్ జె.ఇర్విన్ కూడా నటిస్తోంది. ఆమె నటిస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే.

ఈ చిత్రంలో లారెన్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తోంది. స్వాతంత్ర రాక ముందు జరిగే....కొన్ని సీన్లలో ఆమె రజనీకాంత్‌కు జోడీగా కనిపిస్తుందని తెలుస్తోంది. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సరసన లింగా చిత్రంలో నటించే అవకాశం దక్కడంపై లారెన్ జె ఇర్విన్ సంతోషం వ్యక్తం చేసారు. మరో వైపు రజనీకాంత్ అభిమానులు కూడా ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

లారెన్ జె.ఇర్విన్ ఫోటోలు, లింగా చిత్రానికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

రజనీకాంత్, లారెన్

రజనీకాంత్, లారెన్

లింగా చిత్ర కథానాయకుడు రజనీకాంత్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన బ్రిటిష్ నటి, సింగర్ లారెన్ జె. ఇర్విన్.

కెఎస్ రవికుమార్ దర్శకత్వం

కెఎస్ రవికుమార్ దర్శకత్వం

లింగా చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రజనీ నటించిన ముత్తు, నరసింహ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన కెఎస్ రవికుమార్...‘కొచ్చాడయాన్'చిత్రానికి స్టోరీ కూడా సమకూర్చారు.

సోనాక్షి సిన్మా, అనుష్క

సోనాక్షి సిన్మా, అనుష్క

‘లింగా' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మాస్తున్నారు. రజనీ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క షెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు

రెహమాన్ సంగీతం

రెహమాన్ సంగీతం

‘లింగా' చిత్రానికి రెండుసార్లు ఆస్కార్ అవార్డు సాధించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహ్మాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.కెఎస్ రవి కుమార్, రజనీకాంత్ కాంబినేసన్ అంటే భారీ అంచనాలు ఉంటాయి.

English summary
British Actress Lauren J Irwin who has acted in movies such as Heart and a Hollywood movie Vagary making her Indian movie debut with Superstar Rajinikanth in Lingaa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu