For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బ్రదర్స్‌' చిత్రం ఆ చిత్రం కాపీ కాదు: సూర్య

  By Srikanya
  |

  చెన్నై: కే.వీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య అవిభక్త కవలలుగా నటిస్తున్న చిత్రం 'మాట్రాన్‌'. తెలుగులో 'బ్రదర్స్‌'గా రూపొందుతోంది. 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం Stuck on You కు కాపీ అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో సూర్య ఆ వార్తలను సీరియస్ గా ఖండించారు. ఎవరు ఇలాంటి రూమర్స్ మొదలెడుతున్నారో అర్దం కావటం లేదన్నారు. తమ చిత్రం ఏ హాలీవుడ్ చిత్రానికి కాపీ కాదని,లిప్ట్ చేయాల్సిన అవసరం లేదని, శుభ రాసిన ఓ ప్రెష్ స్టోరీ ని తెరకెక్కించారన్నారు. అలాగే తనకు అసలు Stuck on You చిత్రం ఉందనే విషయం మీడియా ద్వారానే తెలిసిందన్నారు.

  'మాట్రాన్‌' ఇటీవలే సెన్సార్‌కు వెళ్లొచ్చింది. అధికారులు దర్శకుడిని అభినందించినట్టు సమాచారం. 'యు' సర్టిఫికేట్‌ను అందించారు. భారీస్థాయిలో థియేటర్లలోకి తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. హారిస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చగా పా.విజయ్‌, నా ముత్తుకుమార్‌, వివేకా, తామరై, మదన్‌ కార్కి పాటలు రచించారు. 'రంగం' తర్వాత కేవీ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో 'బ్రదర్స్‌' పై అంచనాలు మరింతగా పెరిగాయి. తమిళంలో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న కాజల్‌ దీనిపైనే ఆశలు పెంచుకుంది. మరో విశేషమేమిటంటే.. ఇందులోని ఒక సూర్య పాత్రకు ఆయన సోదరుడు, నటుడు కార్తి గాత్రదానం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

  అంతేగాక ఇప్పటిదాకా అనేక చిత్రాలు అవిభక్త కవలలు మీద వచ్చాయి అని,కానీ వాటిన్నటికీ భిన్నంగా తమ చిత్రం తెరకెక్కిందని ఆయన వివరించారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలో విభిన్నంగా నటించడం సరికొత్త అనుభవమే. నేను నటుడిగా రంగప్రవేశం చేసి 13 ఏళ్లు అయ్యింది. ఇప్పటివరకు మాట్రాన్ చిత్రం లో పాత్రల తరహాలో నటించలేదు. ఇందులో కవలలుగా విరుద్ధ భావాలున్న పాత్రలు పోషించాను. ఒక పాత్ర పేరు అఖిళన్, మరో పాత్ర పేరు విమలన్. ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. అయితే ఇద్దరూ హీరోలే. రెండు పాత్రల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇక ఇందులో దర్శకుడి పని తీరు అద్భుతం. మాట్రాన్ చిత్రం కోసం కెవి ఆనంద్ ఎంతగా శ్రమించారో నాకు తెలుసు అన్నారు.

  దర్శకుడు కె.వి.ఆనంద్ మాట్లాడుతూ థాయిలాండ్‌కు చెందిన అవిభక్త కవలలను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం మాట్రాన్ అని తెలిపారు. ఈ కవలలు అమెరికా వెళ్లి ఒక సర్కస్ కంపెనీ ప్రారంభించి బాగా ఉన్నత స్థితికి చేరుకున్నారని శివాజీ చిత్ర షూటింగ్ సమయంలో ఫ్లైట్‌లో పయనిస్తుండగా ఒక మ్యాగజైన్‌లో చదివానన్నారు. అప్పుడే దీన్ని ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేద్దామని సూర్యతో చెప్పానన్నారు. ఆ విధంగా మాట్రాన్ తెరకెక్కిందని వివరించారు. ఒక పాట మినహా చిత్రం పూర్తి అయ్యిందని చెప్పారు. డబ్బింగ్ కూడా పూర్తి అయ్యిందని, ప్రస్తుతం గ్రాఫిక్స్ జరుగుతున్నాయని తెలిపారు.

  English summary
  it was reported that the movie 'Brothers' was a remake of a Hollywood flick Stuck on You. However, the Ghajini star has rubbished the rumours and has claimed that the film has an original story. At a press meet, Surya said that there is no need for his team to lift anything from a Hollywood team. They have got a wonderful team and the writers SuBha have written a fresh story. He further added that he became aware of 'Struck on You' only after it was reported by media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X