twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రోబో' సీక్వెల్ బడ్జెట్ అంతా?

    By Srikanya
    |

    చెన్నై : రీసెంట్ గా శంకర్ తన తాజా చిత్రం 'రోబో2.0' మొదలెట్టేసిన సంగతి తెలిసిందే. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కే ఈ చిత్రం గా ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోందని నిర్మాత లైక్ ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. ఇదే ఇండియన్ సినిమా లో నే హై బడ్జెట్ ఇది. 2017 సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.

    వాస్తవానికి రజనీకాంత్ పుట్టినరోజున భారీగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నారు. కానీ, చెన్నై వరదల కారణంగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలను వాయిదా వేయడంతో సైలెంట్‌గా ‘రోబో-2' చిత్రం ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం చెన్నై శివార్లలో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరపనున్నారట. రజనీ సరసన గ్లామర్ భామ అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

     Budget Of Rajini’s Robo 2

    శంకర్ ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కించాలని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. 'ఐ' మూవీ అనుకున్నంత సక్సెస్ ఇవ్వకపోవడంతో ఈ డైరెక్టర్ రోబో సీక్వెల్ తో సంచలనం చేయాలని భావిస్తున్నాడు. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ సినిమాని లైకా ప్రొడ‌క్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

    అలాగేఈ సినిమాకోసం శంకర్ ప్రత్యేకంగా వెహికల్స్ తయారుచేయిస్తున్నాడని వీటి ఖరీదు ఒక్కొక్కటి దాదాపు కోటి రూపాయలని తెలుస్తోంది. ఇలాంటివి పది వెహికల్స్ చేయాలని శంకర్ ఆర్డర్ చేసినట్టు తమిళ సినీ వర్గాల టాక్.

    సౌత్‌ నుంచి ఇంటర్నేషనల్‌ వరకూ ఓ సినిమాని ఒకేటైటిల్‌తో ప్రమోట్‌ చేయటానికి శంకర్‌ ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నారు. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాసం ఉంది.

    English summary
    Lyca the production house announced Rajini’s Robo 2 was budgeted for 350 Crores, which is huge to Indian cinema. They also focused towards 2017 summer for the movie release in grand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X