»   » బన్ని ఇచ్చిన ట్విస్ట్ కు దిమ్మ తిగిగిపోయింది

బన్ని ఇచ్చిన ట్విస్ట్ కు దిమ్మ తిగిగిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏ నిముషానికి ఏమి జరుగునో అనే పాట సినీ పరిశ్రమకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకే అనుకున్న ప్రాజెక్టులు...వెనక్కి వెళ్లటం..ఉండదు అనుకున్న సినిమా పట్టాలు ఎక్కేయటం రాత్రికి రాత్రే జరిగిపోతూంటాయి. ఇప్పుడు అలాంటిదే అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి కూడా జరిగిందని తమిళ సినీ వర్గాల సమాచారం.

అల్లు అర్జున్ కోసం తమిళ దర్శకుడు లింగు సామి..పందెం కోడి సీక్వెల్ ని వదిలేసుకుని మరీ స్రిప్టుతో రెడీ అయ్యారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం లింగు సామి ని ప్రక్కన పెట్టి మరో తమిళ దర్శకుడు తెలుగులో మనం, ఇష్క్ చిత్రాలు అందించిన విక్రమ్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బన్నీ డేట్స్ ఇచ్చాడని ఆపేసాడు...విశాల్ కు కాలి,కంప్లైంట్

Bunny chooses Manam Vikram Kumar over Lingusamy

ఈ మేరకు విక్రమ్ కుమార్ ..ఓ స్టోరీ లైన్ ని అల్లు అర్జున్ కు చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీ లైన్ విన్న అల్లు అర్జున్ వేరే ఆలోచన లేకుండా తన తదుపరి చిత్రం డేట్స్ కేటాయిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

దాంతో విక్రమ్ కుమార్ తన టీమ్ తో ఆ స్టోరీ లైన్ ని డవలప్ చేసుకునే పనిలో పడగా..అల్లు అర్జున్ మీద ఆశలు పెట్టుకున్న లింగు సామి మాత్రం అటు విశాల్ తో తగువు పెట్టుకుని, అక్కడ ఫిల్మ్ ఛాంబర్ లో సైతం కేసు వేయించుకుని , ఈ కొత్త ట్విస్ట్ కు షాక్ అయ్యి చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

అల్లు అర్జున్ మాత్రం చక్కగా తన సరైనోడు చిత్రం పై పూర్తి దృష్టి పెట్టారు. ఈ చిత్రం విడుదల అవగానే విక్రమ్ కుమార్ సినిమాకు సంభందించిన పనులు మొదలవుతాయి. విక్రమ్ కుమార్ ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో 24 అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ మార్చి 3న విడుదల కానుంది. అదీ మ్యాటర్.

English summary
Allu Arjun has opted for Manam director Vikram Kumar and is not collaborating with Lingusamy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu