twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడాకుల కేసులో హీరోకి ఫేవర్ గా తీర్పు

    By Srikanya
    |

    జీన్స్ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన తమిళ నటుడు ప్రశాంత్. అతను గత కొంత కాలంగా తన భార్యపై విడాకులు కేసు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చెన్నై ఫ్యామిలీ కోర్టు 2009లో విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చినా దానిని సవాలు చేస్తూ భార్య గృహలక్ష్మి చెన్నై హైకోర్టుకు వెళ్లారు. దాంతో కేసు మొదటి వచ్చింది. ఎట్టకేలకు చెన్నై హై కోర్టు కూడా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్ధిస్తూ కేసు కొట్టివేసి ప్రశాంత్ కి విడాకులను మంజూరు చేసింది. వివాహమైన కొద్ది కాలానికి ప్రశాంత్ కి తన భార్య గృహలక్ష్మికు ముందుగా వివాహమైన సంగతి తెలిసింది. ఆమెకు 1998లో నారాయణన్ వేణు ప్రసాద్‌తో వివాహమైనట్టు రిజిష్టర్ దస్తావేజు సాక్ష్యాధారం లభించింది. దాంతో ఆమెకు అప్పటికే వివాహమైన విషయాన్ని దాచి పెట్టి మరీ తనతో పెళ్లి చేశారని అతను ఫిర్యాదు చేశాడు.

    అయితే ఆమె కుటుంబం వారు విడాకులు కావాలంటే 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే చాలామంది విడాకుల వ్యవహారాన్ని బ్లాక్ మెయిల్స్ వంటి వాటికి వినియోగిస్తూ తప్పులు చేస్తున్నారని చట్టంలో దీనిపై స్ట్రిక్టుగా మార్పులు తేవాల్సిన అవసముందని కోర్టుకి అప్పీలు చేసుకున్నాడు. అలాగే తమకు పుట్టిన బిడ్డ విషయమై గృహలక్ష్మి కుటుంబానికి కల్చర్ అనేది లేదని, రోజంగా క్లబ్ లు, పబ్ లు అంటూ గడపుతారని, అటువంటి చోట పెరిగితే తన బిడ్డకు ఇబ్బంది అన్నారు. ఇతని వాదనను కోర్టు నమ్మి అతనికి విడాకులుని మంజూలు చేసింది.

    English summary
    Judgment has came out favor to actor Prashanth according to that the marriage between actor Prashanth and Gruhalakshmi was worthless and also dismissed the appeal petition of Gruhalakshmi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X