»   » వివాదంలో హన్సిక, కేసు పెడతానంటూ నిర్మాత

వివాదంలో హన్సిక, కేసు పెడతానంటూ నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: హన్సిక సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఆమె మీద ఓ నిర్మాత కేసు పెట్టడానికి సిద్దగా ఉన్నారు. ఆమె తనను ఛీట్ చేసినట్లు ఆయన చెప్తున్నారు. ఈ మేరకు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసానని, త్వరలోనే హన్సిక సంగతి తేలుస్తానంటూ ఆయన మండిపడుతున్నారు.

అసలేం జరిగిందనే విషయాల్లోకి వెల్తే... బందా పరమశివం, ఒంబదుల గురు చిత్రాల దర్శక నిర్మాత, పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన పీటీ.సెల్వకుమార్ ఆ మధ్య జీవా, హన్సిక కాంబినేషన్ లో పోకిరిరాజా అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అది ప్రక్కన పెడితే ఆడియో వేడుక సమయంలో పంక్షన్ కు వస్తానని హ్యాండ్ ఇచ్చింది.

Case Filed Against Hansika Motwani?

ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని తమిళనాడులోని కోవైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ హన్సిక పాల్గొననున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె ఆ కార్యక్రమానికి హాజరవలేదు. దీంతో నిర్మాత పీటీ.సెల్వకుమార్ హన్సిక కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించమని ఆమెను అడిగారు.

ఇదే విషయమై నిర్మాత మండలిలోనూ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ హన్సిక ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో నిర్మాత ఆమెపై కేసు పెట్టడానికి సిద్ధం అయ్యారు. అసలే సినిమా పోయిందన్న బాధలో ఉన్న ఆయనకు ఆమె నిర్లక్ష్యంగా వ్యవహించటంతో కాలేలా చేస్తోంది.

పీటీ.సెల్లకుమార్ మాట్లాడుతూ... పోకిరిరాజా చిత్రంలో నటించినందుకుగానూ హన్సికకు ఒప్పందం ప్రకారం రెమ్యునేషన్ పూర్తిగా చెల్లించానని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కోవైలో నిర్వహించ తలపెట్టామన్నారు. అందులో హన్సిక పాల్గొనడానికి ఆమెకు డ్రస్, హోటల్ ఖర్చు, ట్రావిలింగ్ ఛార్జెస్ కోసం లక్షల్లో ఖర్చు చేశామన్నారు. ఇంతాచేస్తే హన్సిక చివరి వరకూ వస్తానని చెప్పి, చివర్లో హ్యాండ్ ఇచ్చి రాలేదని ఆరోపించారు.

ఈ వ్యవహారం గురించి నిర్మాత మండలి ద్వారా మాట్లాడించినా హన్సిక నుంచి సరైన సమాధానం రాలేదని, డబ్బు తిరిగి చెల్లించలేదని చెప్పారు. పైగా తనను అవమానించే విధంగా మాట్లాడారని తెలిపారు. నటి హన్సికపై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

హన్సికకు ఇటీవల తమిళ పరిశ్రమలో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఇటీవల తను నటించిన పులి, పోకిరిరాజా చిత్రాలు వరుసగా ఫెయిల్యూర్స్ అవటం కూడా ఇందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం హన్సిక జయంరవికి జంటగా బోగన్ అనే ఒక్క చిత్రం మాత్రమే చేస్తున్నారు.

English summary
P.T Selvakumar who is produced Pokkiri Raja wants to registered a complaint on Hansika alleging a breach of agreement from her side.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu