twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెన్నై బాంబ్ బ్లాస్ట్‌పై సినీ తారల స్పందన

    By Bojja Kumar
    |

    చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో బెంగళూర్ - గౌహతి ఎక్స్‌ప్రెస్ రైల్లో బాబు పేలుళ్ల సంఘటన తీవ్ర సంచనలం సృష్టించింది. పేలుళ్లు రైలులోని ఎస్4, ఎస్5 అనే రెండు బోగీల్లో సంభవించాయి. ఆ ఘటనలో ఒకరు మరణించగా, పదుల సంఖ్యలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పలువురు కాళ్లు, చేతులు పోగొట్టుకున్నారు. ఘటనా స్థలం వద్ద జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఎ) దర్యాప్తు చేపట్టింది.

    ఈ పేలుడు సంఘటనపై పలువురు సినీ తారలు స్పందించారు. పేలుళ్లకు పాల్పడినవారి చర్యను ముక్త కంఠంతో ఖండించారు. ఈ ఘటనలో అమాయకులను బలికావడంపై ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నినదించారు.

    సినీతారల కామెంట్స్ స్లైడ్ షోలో....

    ఖుష్భూ

    ఖుష్భూ

    సిటీలో దిగగానే చాలా దిగ్ర్భాంతికరమై న్యూస్ విన్నాను. బాధితులకు సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు.

    శృతి హాసన్

    శృతి హాసన్


    చెన్నైలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసి చాలా డిస్ట్రబ్ అయ్యాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి.

    జీవా

    జీవా


    తమిళనాడు ఈ ప్రపంచలోనే సురక్షితమైన ప్రదేశం. ఇది బాంబ్ బ్లాస్టా? యాక్సిడెంటా? అర్థం కావడం లేదు. మేడే రోజు ఈ సంఘటన జరుగడాన్ని నమ్మలేక పోతున్నాను.

    జయం రవి

    జయం రవి


    చెన్నై బాంబ్ బ్లాస్ట్‌లో గాయపడిన వారు త్వరగా కోలు కోవాలని కోరుకుంటున్నాను. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం. సురక్షితమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి అన్నారు.

    జివి ప్రకాష్

    జివి ప్రకాష్


    ఎంతో సురక్షితమైన చెన్నై నగరంలో ఇలాంటి ఘటన జరుగడాన్ని నమ్మలేక పోతున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. జనం ఎక్కువగా ఉన్న చోట కేర్ ఫుల్‌గా ఉండండి.

    వెంకట ప్రభు

    వెంకట ప్రభు

    చెన్నైలో బాంబ్ బ్లాస్ట్ జరుగడం ఎంతో దురదృష్టకరమైన సంఘటన. కానీ చెన్నైఎంతో సురక్షితమైన ప్రదేశం.

    లక్ష్మీరాయ్

    లక్ష్మీరాయ్

    చెన్నైలో బాంబ్ బ్లాస్ జరిగిందంటే నమ్మలేక పోతున్నాను. మన దేశంలో అసలు ఏం జరుగుతోంది? ఇదొక భయానకమైన విషాద సంఘటన.

    సిద్ధార్థ్

    సిద్ధార్థ్


    చెన్నై రైల్వే స్టేషన్లో బాంబ్ బ్లాస్. చెన్నై చరిత్రలో ఇదొక విషాదకరమైన ఉదయం.

    English summary
    
 "I land in my city to a very disturbing news of bomb blast..deepest condolences to the family of the deceased n speedy recovery 2 the injured" Khushboo tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X