»   » 'రామ్ చరణ్' టైటిల్ తో రామ్ చరణ్ చిత్రం

'రామ్ చరణ్' టైటిల్ తో రామ్ చరణ్ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ చిత్రానికి 'రామ్ చరణ్' అనే టైటిల్ నే ఫిక్స్ చేసారు. ఇంతకీ ఏ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ఈ టైటిల్ పెట్టారని ఆలోచనలో పడ్డారా ... ఆ చిత్రం మరేదో కాదు 'ఆరెంజ్' చిత్రం తమిళ డబ్బింగ్ వెర్షన్ కి ఈ టైటిల్ ని ఫిక్స్ చేసారు. 'మగధీర' చిత్రం తమిళంలో మావీరన్ టైటిల్ తో విడుదలై మంచి కలెక్షన్స్ సంపాదించటంతో ఇప్పుడు ఆయన చిత్రాలన్నీ వరసగా డబ్బింగ్ అవుతున్నాయి.

రీసెంట్ గా రామ్ చరణ్,పూరీ జగన్ కాంబినేషన్ లో రూపొందిన 'చిరుత' చిత్రం తమిళంలో డబ్బింగ్ చేసారు. 'చిరుత్తై పులి' టైటిల్ తో ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసారు. అయితే డబ్బింగ్ నిర్మాతలకు ఎదురుదెబ్బ తగలింది. మొత్తం 19 స్క్రీన్లలో అక్కడ విడుదలైన 'చిరుత్తై పులి' చిత్రం బ్యాడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. చిత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా శాటిలైట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ డబ్బింగ్ స్పీడు తగ్గలేదు.

రామ్ చరణ్ ...రచ్చ చిత్రం కూడా'రగలై'గా విడుదలై మంచి మంచి టాకే తెచ్చుకుంది. కానీ పెద్గగా కలెక్టు చేయలేకపోయింది. అందుకు కారణం రామ్ చరణ్ మగధీర రేంజిలో ఆచిత్రం లేక పోవడమే అని విశ్లేషణలు వచ్చాయి. అయితే ఈ తాజా చిత్రం ఆరెంజ్ ...బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందటంతో అక్కడ బాగానే బిజినెస్ అవుతుందని బావిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హ్యారీష్ జైరాజ్ సంగీతం అందించటం,హ్యారీస్ కు తమిళంలో మంచి మార్కెట్ ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు.

రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందిన ఆరెంజ్ చిత్రాన్ని నిర్మాత నాగబాబు..ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. మలేషియా, ఆస్ట్రేలియా, ముంబయి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరిపారు. జెనీలియా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో షాజన్‌ పదమ్ ‌సీ సెకెండ్ హీరోయిన్ గా చేసింది. షాజన్‌ పదమ్ ‌సీ సినిమా ఫ్లాష్ ‌బ్యాక్‌ సన్నివేశాల్లో ఆమె పాత్ర వస్తుంది. సినిమా ప్లాప్ అయినప్పటికీ పాటలు ఇక్కడ హిట్ అయ్యాయి. మరి తమిళంలో ఏమి జరగనుందో చూడాలి.

English summary
Ram Charan, Genelia starrer Orange is being dubbed in Tamil. The Tamil version’s title has been finalized as “Ram Charan”. Bommarillu Bhaskar had directed the film and most part of the film was shot in Australia.
Please Wait while comments are loading...