»   » విక్రమ్ అదరగొట్టాడు, నయనతార కేక (‘ఇంకొక్కడు’ అఫీషియల్ ట్రైలర్)

విక్రమ్ అదరగొట్టాడు, నయనతార కేక (‘ఇంకొక్కడు’ అఫీషియల్ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో విక్రమ్... తను చేసే సినిమాలో పాత్ర కోసం ఎంత కష్టపడతారో సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇపుడు విక్రమ్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వం 'ఇరుమురుగన్' అనే మవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విక్రమ్ తో పాటు నయనతార, నిత్యామీనన్ కీలక పాత్రలు చేస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని 'ఇంకొక్కడు' పేరుతో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. గత నెలలోనే సైమా వేడుకల్లో తెలుగు టీజర్ ను చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇపుడు 'ఇరుమురుగన్' తమిళ ట్రైలర్ రిలీజైంది. రెండ్రోల్లో తెలుగే వెర్షన్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతోంది.


ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రెండు నిమిషాల నిడివి గల వీడియోలో ఎక్కువభాగం షూటింగ్ మలేషియాలో జరిగింది. ఇందులో విక్రమ్ డ్యూయల్ రోల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.'అరిమా నంబి'తో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన ఆనంద్‌ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం. విక్రమ్‌ సరసన నయనతార, నిత్యామీనన్ తొలిసారిగా నటిస్తున్నారు. హారిస్‌ జైరాజ్‌ స్వరాలందిస్తున్నారు. ట్రైలర్లో మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. సినిమాలో కూడా అదే రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ ఎఫెక్ట్ కూడా ట్రైలర్లో సూపర్ గా ఉంది.


స్లైడ్ షోలో ఈ చిత్రానికి సంబంధించిన నయనతార, నిత్యా మీనన్ హాట్ ఫోటోస్...


ఇరుమురుగన్

ఇరుమురుగన్

ఆనంద్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని థమీన్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై శిభు థమీన్స్‌ నిర్మిస్తున్నారు.


రిలీజ్

రిలీజ్

ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో సెప్టెంబర్ 9న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.


తెలుగు

తెలుగు

ఈ చిత్ర తెలుగు వర్షన్ హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. విక్రమ్ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది.


హిజ్రా పాత్రలో..

హిజ్రా పాత్రలో..

ఈ సినిమాలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో ఆయన హిజ్రాగా కనిపించనున్నారు.


విక్రమ్

విక్రమ్

ఈ మధ్యకాలంలో సరైన విజయం లేని విక్రమ్‌కు ఈ సినిమా సక్సెస్‌ కీలకంగా మారింది. రం


ట్రైలర్ బావుంది

ట్రైలర్ బావుంది

సినిమా ట్రైలర్ బావుండటంతో సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారంతా.


స్టైల్ సూర్

స్టైల్ సూర్

ఈ సినిమాలో విక్రమ్ స్టైల్ సూపర్ గా ఉందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.


నయనతారతో కెమిస్ట్రీ..

నయనతారతో కెమిస్ట్రీ..

విక్రమ్, నయనతార మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని, ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ఆకట్టుకుంటాయని అంటున్నారు.
English summary
Check out Iru Mugan Official Trailer. Director Anand Shankar returns with his next, the action-packed ‘Iru Mugan’ starring Vikram, Nayanthara, & Nithya Menen in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu