»   » కమల్ హాసన్ డాన్ పాత్రలోనా?

కమల్ హాసన్ డాన్ పాత్రలోనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కమల్‌హాసన్‌ మరోమారు ప్రయోగాత్మక చిత్రకథలో కనిపించనున్నారు. ఆయన హీరోగా రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'తూంగావనం'. ఈ సినిమా తెలుగులో 'చీకటిరాజ్యం'గా ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం కూడా బుధవారం జరుగనుంది. ఇందులో డాన్‌ పాత్రలో కమల్‌ కనిపించనున్నట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.

త్రిష, ప్రకాశ్‌రాజ్‌, కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు. ఇందులో నటుడిగా మాత్రమే కాకుండా ఇతర సాంకేతిక విభాగాల్లో కూడా తన ప్రతిభను కనబరుస్తున్నారు. దీపావళి సందర్భంగా సినిమాను తెరపైకి తీసుకొచ్చి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 'విశ్వరూపం' తర్వాత వచ్చిన 'ఉత్తమవిలన్‌' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కమల్‌ అభిమానులు ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు.


Cheekati Rajyam: Kamal Haasan as a don

మరో ప్రక్క ఈ చిత్రంలో కమల్ నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో వింగ్ కు చెందిన ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నార్కోటిక్స్ ప్రపంచంలోని కొందరు వ్యక్తులు తన కుమారుడుని కిడ్నాప్ చేస్తే ఎలా వారిని ఎదుర్కొని, వెనక్కి తెచ్చుకున్నాడనే కథాంశంతో నడుస్తుందని చెప్తున్నారు.


'చీకటి రాజ్యం' విశేషాలు


Cheekati Rajyam: Kamal Haasan as a don

 
కమల్‌హాసన్‌, త్రిష కలసి నటిస్తున్న రెండో చిత్రం 'చీకటిరాజ్యం'.రాజేశ్‌ ఎం సెల్వ దర్శకుడు. ఎన్‌.చంద్రహాసన్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మేకింగ్ వీడియోని రీసెంట్ గా విడుదల చేసారు.

కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై... కమల్ సోదరుడు చంద్రహసన్ నిర్మిస్తున్న చిత్రం చీకటిరాజ్యం. కమల్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న రాజేశ్.ఎమ్.సెల్వ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరో కీలకపాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా.. గతంలో మన్మథబాణం చిత్రంలో కమల్ తో కలసి నటించిన త్రిష.. మరోసారి ఈ సినిమాలో కమల్ కు జంటగా కనిపించబోతోంది. కిషోర్, సంపత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

English summary
After playing an ageing superstar in latest Tamil outing “Uttama Villain”, actor-filmmaker Kamal Haasan will be seen as don in his upcoming Tamil-Telugu bilingual Cheekati Rajyam.
Please Wait while comments are loading...