twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ సతీమణికి కోర్టు వార్నింగ్.. ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు!

    |

    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు చెన్నై కోర్టు మరోసారి హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లత రజనీకాంత్ గిండీ అనే ప్రదేశంలో నిర్వహిస్తున్న ది ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ హైయ్యర్ సెకండరీ స్కూల్‌ ఖాళీ విషయంలో తలెత్తిన వివాదంలో కోర్టు జోక్యం చేసుకొన్నది. కోర్టు పేర్కొన్న నిర్ణీత గడువులో తన స్కూల్‌ను ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నది. ఇంతకు ఈ వ్యవహారంలో ఏం జరిగిందంటే..

    1 కోటి 90 లక్షల బాకీ

    1 కోటి 90 లక్షల బాకీ

    గిండీలోని ఓ భవనంలో నిర్వహిస్తున్న స్కూల్‌కు సంబంధించిన అద్దె విషయంలో వివాదం చోటుచేసుకొన్నది. ఆశ్రమ్ స్కూల్‌కు సంబంధించి తమకు కోటి 99 లక్షల రూపాయలు లత రజనీకాంత్ బాకీ పడ్డారు అని కోర్టులో ఫిర్యాదు చేశారు. కొద్దికాలంగా అద్దె చెల్లించడంలో జాప్యం చేస్తున్నట్టు ఆ భవనం యాజమాన్యం కోర్టులో ఫిర్యాదు చేసింది.

    ఆశ్రమ్ విద్యాసంస్థలకు తాళం

    ఆశ్రమ్ విద్యాసంస్థలకు తాళం

    లత రజనీకాంత్‌, భవన యజమానికి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. యజమానులు స్కూల్ భవనానికి తాళం వేసుకొన్నారు. దాంతో ఇరు పార్టీలు కోర్టును ఆశ్రయించాయి. తమకు అందాల్సిన అద్దె మొత్తంతోపాటు ఖాళీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దాంతో ఏప్రిల్ 2020 లోగా ఖాళీ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

    లత రజనీకాంత్ టీమ్‌కు మందలింపు

    లత రజనీకాంత్ టీమ్‌కు మందలింపు

    అయితే లత రజనీకాంత్‌‌కు సంబంధించిన బృందం భవనాన్ని ఖాళీ చేయడంలో విఫలమయ్యారు. దాంతో ఇటీవల మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారనే విషయాన్ని ప్రస్తావించారు. దాంతో కోర్టు లత రజనీకాంత్ టీమ్‌ను మందలించింది. అయితే లాక్‌డౌన్ కారణంగా తాము ఖాళీ చేయలేదని వివరణ ఇచ్చారు.

    ఆదేశాలు పాటించకపోతే.. తీవ్ర పరిణామాలు

    ఆదేశాలు పాటించకపోతే.. తీవ్ర పరిణామాలు

    లత రజనీకాంత్ న్యాయవాది వాదనకు సానుకూలంగా కోర్టు స్పందించింది. ఏప్రిల్ 2021లోపు ఖాళీ చేసి.. బాకీ మొత్తాన్నిచెల్లించేలా చర్యలు తీసుకోవాలని లత తరుఫు న్యాయవాదికి సూచించింది. ఒకవేళ కోర్టు ఆదేశాలు పాటించని యెడల.. దానిని కోర్టు ధిక్కార కేసుగా పరిగణించాల్సి వస్తుంది అని చెన్నై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    English summary
    Superstar Rajinikanth wife Latha Rajinikanth gets warning from Chennai High Court. Court serious over The Ashram Group of Institutions vacation and rent pending. Chennai High court has given a final time till April 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X