twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ 'విశ్వాసం'కి హ్యాట్సాఫ్.. పోలీస్ కమిషనర్ ఫిదా.. కూతురి కోసం అంత కంగారులో కూడా!

    |

    తమిళ స్టార్ హీరో తల అజిత్, ప్రముఖ దర్శకుడు శివ కాంబినేషన్ లో వరుసగా నాలుగోసారి వచ్చిన చిత్రం విశ్వాసం. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. అజిత్, నయనతార జంటగా నటించారు. ఇమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సూపర్ స్టార్ రజని పేట చిత్రంతో పోటీ ఉన్నప్పటికీ విశ్వాసం మంచి వసూళ్లు రాబడుతోంది. సినీ క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు లభించాయి. పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఈ చిత్రానికి ఫిదా అవుతుండడం విశేషం.

    వరుసగా నాలుగోసారి

    వరుసగా నాలుగోసారి

    అజిత్, శివ కాంబోలో వచ్చిన వీరం, వేదాలం లాంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఆ తర్వాత వచ్చిన వివేగం చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా అజిత్ మరోసారి శివ దర్శత్వంలోనే నటించాడు. ఈ సారి విశ్వాసం పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరి నిమిషంలో ఈ చిత్రం అనూహ్యంగా సంక్రాంతి బరిలో నిలిచింది. అజిత్, నయనతార జంట తమిళంలో సూపర్ హిట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనితో విశ్వాసం చిత్రంపై అంచనాలు పెరిగాయి.

    పోలీసు కమిషనర్ ఫిదా

    పోలీసు కమిషనర్ ఫిదా

    అజిత్ అభిమానులు, సినీ ప్రముఖులు మాత్రమే కాదు పోలీసులు కూడా విశ్వాసం చిత్రానికి ఫిదా అవుతున్నారు. చెన్నై నగర పోలీస్ కమిషనర్ అర్జున్ శరవణన్ విశ్వాసం చిత్రాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అజిత్, దర్శకుడు శివ, నయనతారపై ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రంలో ట్రాఫిక్ రూల్స్ కి సంబందించిన విషయాలని తాను గుర్తించానని అర్జున్ శరవణన్ అన్నారు.

    కూతురి కోసం కంగారుగా వెళుతూ

    కూతురి కోసం కంగారుగా వెళుతూ

    విశ్వాసం చిత్రాన్ని చూసే అవకాశం నాకు దక్కింది. ఈ చిత్రంలో కొన్ని విషయాలు నన్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో,హీరోయిన్లు బైక్ పై వెళుతూ హెల్మెట్స్ ధరించి కనిపించారు. హీరో తన కుమార్తెని రక్షించడానికి కంగారుగా వెళుతూ కూడా కారులో సీట్ బెల్ట్ వేసుకున్నాడు. అజిత్ లాంటి స్టార్ హీరో చిత్రంలో ట్రాఫిక్ రూల్స్ పాటించడం సంతోషించదగ్గ విషయం. తమిళనాడులో రోడ్డు ప్రమాదాలకు గురై చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అర్జున్ శరవణన్ అన్నారు.

    తల్లిదండ్రులకు కూడా

    తల్లిదండ్రులకు కూడా

    లక్షలాది అభిమానులు ఉన్న అజిత్ ట్రాఫిక్ రూల్స్ పాటించారు. ఆయన అభిమానులు కూడా అలాగే చేయాలని పోలీస్ కమిషనర్ శరవణన్ కోరారు. ఏ చిత్రం ద్వారా తల్లిదండ్రులకు కూడా ఓ విషయం చెప్పాలని అనుకున్నా.మీ ఆలోచనలని, కలలని మీ పిల్లలపై రుద్దవద్దు అని శరవణన్ తెలిపారు. జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు 120 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకుపోతోంది.

    English summary
    Chennai Police Commissioner is all praise for Ajith's Visawasam due to this important reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X