»   » డైలీ సీబీఐ ఆఫీసుకు వెళ్ళివస్తున్న దర్శకుడు

డైలీ సీబీఐ ఆఫీసుకు వెళ్ళివస్తున్న దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ తమిళ దర్శకుడు చేరన్(నా ఆటోగ్రాఫ్ ఫేమ్) రోజూ చెన్నైలోని సీబీఐ ఆఫీసుకు వెళ్ళివస్తున్నారు. అయితే ఆయనకు అక్కడ పనేముంది... ఏదన్నా లీగల్ కేసుల్లో ఇరుకున్నారా అంటే అదేమీ లేదు. మిస్కిన్ డైరక్షన్ లో రానున్న సిబీఐ ఆఫీసర్ అనే చిత్రంలో ఆయన కీలకమైన పాత్ర చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్టయిన అంజాదే(తెలుగులో స్నేహం)కు సీక్వెల్. అక్కడ సీబీఐ ఆఫీసులో ఎలా ఉంటారో, వారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుని అనుసరించటానికి అలా చేరన్ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై చేరన్ మాట్లాడుతూ...అలా చేయటం వల్ల సినిమాకు రియలిస్టిక్ టచ్ వస్తుంది. ముఖ్యంగా నా పాత్ర బాగా పండే అవకాశం ఉంది. సీబీఐ ఆఫీసర్స్ రొటీన్ వర్క్ కి ఇబ్బంది కలగకుండా చేరన్ వారిని అబ్జర్వ్ చేస్తున్నాను. అందుకోసం స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకున్నాను అన్నారు. ఇంతకుముందు కాక కాక(తెలుగు ఘర్షణ) చేసేటప్పుడు హీరో సూర్య కూడా టాప్ పోలీస్ ఆఫీసర్స్ తో కొంత కాలం గడిపి వారి జీవన శైలిని తెలుసుకున్న తర్వాతే చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu