For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డైరక్టర్ చేరన్‌ కూతురు లవ్ స్టోరీ క్లైమాక్స్ (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  చెన్నై : తన కుమార్తె దామిని తిరిగివడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు చేరన్‌ పేర్కొన్నారు. ఆమె ఓ యువకుణ్ని ప్రేమించిన వ్యవహారంలో దర్శక నటుడు చేరన్‌ పోలీసులు, కోర్టు.. అంటూ చాలా సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నో నేరారోపణలు ఉన్న ఓ వ్యక్తిని తన కుమార్తె ప్రేమించిందని.. అతడి నుంచి కుమార్తెను రక్షించాలని పోలీసులను, కోర్టును ఆశ్రయించారాయన. పలు పరిణామాల అనంతరం దామిని మళ్లీ తండ్రి వద్దకు చేరుకుంది.

  ఈ విషయమై చేరన్‌ మాట్లాడుతూ.. ''నా కుమార్తె ఇంటికి రావడం సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటల్లేవు. రెండు వారాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. ఇప్పుడు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా. సమస్యాత్మక సమయంలో నా స్నేహితులు, సినీ పెద్దలు అండగా నిలిచారు. వారి సహాయన్ని ఎప్పటికీ మరిచిపోలేను. చాలామంది తమ నిజజీవితంలో జరిగిన సంఘటనలను చూసి నాకు సహకరించారు. సినీ పరిశ్రమలో నేను సంపాదించింది.. మంచి (సినీ) మిత్రులనే! వారే నా ఆస్తి. నా కుమార్తె సాధారణ స్థితికి చేరుకుని విద్యపై శ్రద్ధ పెంచుకుంటుందని ఆశిస్తున్నాన'ని పేర్కొన్నారు.

  తెరపై ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు కుటుంబం...అలాంటి ప్రేమ కథతోటే సతమతమవుతోంది. నా ఆటోగ్రాఫ్ వంటి ఎన్నో విభిన్న ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు చేరన్ కూతురు లవ్ స్టోరీ కూడా సినిమా కన్నా వేగంగా మలుపులు తిరుగింది. ప్రియుడితోనే ఉంటానంటూ ఆయన కుమార్తె దామిని పట్టుబట్టింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ఆమె మాత్రం ప్రియుడే కావాలంటూ భీష్మించుకు కూర్చుంది. అయితే చివరకు కథ సుఖాంతమైంది.

  మిగతా కథనం స్లైడ్ షోలో...

  మీడియాలో ..

  మీడియాలో ..

  దర్శకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న దర్శక నటుడు చేరన్ చిన్న కుమార్తె దామిని (20), సహాయ దర్శకుడు చంద్రుని ప్రేమిస్తున్నానంటూ భద్రత కోసం నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. చేరన్,భార్యతో కలిసి మీడియా ముందుకు వచ్చారు.

  కూతురు కూడా..

  కూతురు కూడా..

  తన తండ్రి చేరన్ తన ప్రియుడు చంద్రుని హతమార్చేందుకు పన్నాగాలు పన్నుతున్నారని చేరన్ కుమార్తె దామిని ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో డిప్యూటీ కమిషనర్ శివకుమార్, సహాయ కమిషనర్ శ్యామలా దేవీ చేరన్ దంపతుల వద్ద విచారణ చేపట్టడంతో పాటు రాత్రంతా దామినికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

  మనస్తాపంతో కత్తి పోటు..

  మనస్తాపంతో కత్తి పోటు..

  మరో ప్రక్క కుమార్తె ప్రేమ వ్యవహారంతో మనస్తాపానికి గురైన చేరన్ సతీమణి సెల్వరాణి రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భర్తపై కన్నకూతురే ఫిర్యాదు చేయడంతో తనకు తాను కత్తితో పొడుచుకునేందుకు యత్నించిందని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పినట్టు సమాచారం. అనారోగ్యం బారిన పడినట్లు పేర్కొంటూ స్థానిక రాజాఅన్నామల్లైపురంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం సెల్వరాణిని కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం అధిక రక్తపోటుతో బాధపడుతున్న సెల్వరాణి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది.

  చేరన్ వివరణ..

  చేరన్ వివరణ..

  ఈ విషయమై చేరన్ వివరణ ఇస్తూ .. తన కుమార్తె ప్రేమ వ్యవహారానికి తానెప్పడూ అడ్డు చెప్పలేదన్నారు. చంద్రూ ప్రవర్తన మంచిది కాకపోవడంతోనే జాగ్రత్తపడినట్లు తెలిపారు. అవగాహన లేకపోవడం వల్లే తనపై తన కుమార్తె ఫిర్యాదు చేసిందన్నారు. చంద్రుపై జరిగిన దాడికి తనకే సంబంధం లేదని, అవసరమైతే పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేయవచ్చన్నారు. తన కుమార్తెకు ప్రాణహాని ఉన్నందున ఆమెకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

  చంద్రు

  చంద్రు

  ప్రియుడు చంద్రు కూడా దామినితోనే జీవిస్తానంటూ మొండికేసాడు. ఆమె లేనిదే తన జీవితం లేదన్నాడు. తన ప్రేమ పెద్దలు ఒప్పుకోవటం లేదని, ఒప్పుకుని దీవించాలని మీడియాతో చెప్పాడు. అతనికి సపోర్టుగా అతని లవర్, చేరన్ కుమార్తె దామిని నిలిచారు.

  దర్శకులంతా...

  దర్శకులంతా...

  చేరన్ కి దర్శకులు అమీర్, సముద్రకని, నటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి అండగా ఉన్నారు. వారితో కలిసే చేరన్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి చేరుకుని ఓ విజ్ఞప్తి లేఖను అందించారు. అందుకే చేరన్....సమస్యాత్మక సమయంలో నా స్నేహితులు, సినీ పెద్దలు అండగా నిలిచారు. వారి సహాయన్ని ఎప్పటికీ మరిచిపోలేను. చాలామంది తమ నిజజీవితంలో జరిగిన సంఘటనలను చూసి నాకు సహకరించారు. సినీ పరిశ్రమలో నేను సంపాదించింది.. మంచి (సినీ) మిత్రులనే అని ఎమోషన్ ల్ గా అన్నారు.

  లేటెస్ట్ చిత్రం ...

  లేటెస్ట్ చిత్రం ...

  ఇక చేరన్ దర్శకుడిగా తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. శర్వానంద్‌, నిత్యమీనన్‌ జంటగా నటించారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. వృత్తి, ఉద్యోగ జీవితం.. అంటూ నేటి యువత ఉరుకులు.. పరుగులు పెడుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు దూరంగా పరిగెడుతున్న వారు ఏం కోల్పోతున్నారో మా చిత్రంలో చూపిస్తున్నామంటున్నారు చేరన్‌. చేరన్ మాట్లాడుతూ ''పిల్లలపై తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. తాము కన్న కలల్ని సాకారం చేయాలని ఆశిస్తుంటారు. అయితే ఈ విషయంలో యువత ఏం చేస్తోందనేదే ఈ చిత్ర ప్రధానాంశం. నేటి తరం ప్రేమ వ్యవహారాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు చేరన్‌. మనసుని హత్తుకునేలా భావోద్వేగాలుంటాయి. అంతే స్థాయిలో వినోదమూ ఉంటుంది. ఈ సినిమా యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకొంటుంది. శర్వానంద్‌, నిత్యమీనన్‌ల జంట అందరినీ అలరిస్తుంది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తాము'' అన్నారు.

  English summary
  Tamil actor-director Cheran, who was in news early this month because of his daughter, is in news again. Now, it is reported that his daughter Damini return home. After this incident, Cheran is all set to see good days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X