Just In
- 18 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 30 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
- 1 hr ago
Box office: పది రోజులైనా తగ్గని క్రాక్ హవా.. మొత్తానికి మాస్టర్ పనైపోయింది
- 1 hr ago
సిగరెట్ తాగుతూ బోల్డ్ మాటలు.. షాక్ ఇచ్చిన రేసుగుర్రం మదర్ పవిత్ర.. రెడ్ రెమ్యునరేషన్ ఎంత?
Don't Miss!
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- News
అమరావతి ఉద్యమం 400 వ రోజు : గొల్లపూడిలో హై టెన్షన్ ; ఇంట్లోనే దీక్షకు దిగిన దేవినేని ఉమ
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Sports
అతని గురించి ఎంత చెప్పినా తక్కువే.. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా మ్యాచ్ కాపాడాడు: గవాస్కర్
- Automobiles
స్పోర్ట్స్ కార్లా హ్యుందాయ్ ఎలాంట్రా; దీని నుంచి చూపు తిప్పుకోవటం కష్టం!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దొడ్డి దారిలో గెలుపు.. కోట్ల రూపాయలు స్వాహా.. రాధారవిపై చిన్మయి ఫైర్
డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో రాధారవి కుట్ర పన్ని గెలిచారని గాయని, డబ్బింగ్ కళాకారిని చిన్మయి విమర్శించింది. డబ్బింగ్ యూనియన్ భవన నిర్మాణంలో అవక తవకలు జరిగాయని, లక్షల్లో డబ్బును తినేశారని, నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేసింది. సౌత్ ఇండియన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న రాధారవి ఆ యూనియన్ నుంచి చిన్మయిని తొలగించిన సంగతి తెలిసిందే. వార్షిక చందాను చెల్లించని కారణంగానే సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు యూనియన్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే తనపై కక్షతోనే రాధారవి తన సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించిన చిన్మయి దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి విజయం సాధించిన విషయం తెలిసిందే.

రాధారవికి పోటీగా..
అయినప్పుటికీ ఆమె సభ్యత్వాన్ని ఆమోదించేది లేదంటూ యూనియన్ నిర్వాహకులు దూరం పెడుతూనే వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాధారవి అధ్యక్ష పదవికి పోటీ చేయగా ఆయనకు వ్యతిరేకంగా చిన్నయి నామినేషన్ దాఖలు చేసింది. అయితే ఆమె నామినేషన్‌ను తిరష్కరించిన ఎన్నికల అధికారి నటుడు రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

అతి పెద్ద కుట్ర..
దీనిపై చిన్మయి ఫైర్ అయింది. ఈమె మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలయినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలని చెప్పుకొచ్చింది. అలాంటిది తన నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారన్నది వెల్లడించకుండా రాధారవి విజయం సాధించారని ప్రకటించడంలో అతి పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొంది. ఇక్కడ ఓడింది తాను మాత్రమే అయితే మాట్లాడేదాన్ని కాదని అంది.

కోట్లలో స్వాహా..
పలు ఏళ్లుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌లో సభ్యులుగా ఉన్న వందలాది మంది పారితోషకాలు నుంచి తీసుకున్న 10 శాతం డబ్బుతో యూనియన్‌ను నిర్వహిస్తున్నారని, ఆ డబ్బుతోనే యూనియన్‌కు భవనాన్ని కట్టించారని తెలిపింది. అయితే రూ. 47.5 లక్షలతో స్థలాన్ని, భవనాన్ని కట్టించి కోట్ల రూపాయలకు పైగా డబ్బింగ్ కళాకారుల డబ్బును స్వాహా చేశారని ఆరోపించింది.

దొడ్డిదారిలో రాధారవి..
ఆ అవినీతిని బయటకు తీయడానికే తాము పోరాడుతున్నామని పేర్కొంది. అయితే ఎదిరించి మాట్లాడితే హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారని, ఫోన్‌లో దుర్భాషలాడుతున్నారని ఆరోపించింది. అయినప్పటికీ యూనియన్‌లో రాధారవికి వ్యతిరేకంగా 45 శాతం ఓట్లు పోలయ్యాయని వెల్లడించింది. ఇప్పుడు తానూ వారికి వ్యతిరేకంగా మారడంతో ఓటమి ఖాయమని భావించి.. దొడ్డి దారిలో రాధారవి గెలిచాడని ఆరోపించింది. ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తూ తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చిన్మయి పేర్కొంది.