»   » యాసిడ్ దాడి చేస్తాం.. చిన్మయికి బెదిరింపులు.. బాధితురాలికే కష్టాలా?

యాసిడ్ దాడి చేస్తాం.. చిన్మయికి బెదిరింపులు.. బాధితురాలికే కష్టాలా?

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ సినీ రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి లైంగిక ఆరోపణలు చేయడం కోలీవుడ్‌ను కుదిపేసింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మీ టూ ఉద్యమానికి గాయని వ్యాఖ్యలు మద్దతుగా నిలిచాయి. చిన్మయి వ్యాఖ్యలకు ప్రముఖులు కూడా మద్దతు తెలిపారు. దాంతో చిన్మయి మీ టూ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నది. చిన్మయి తమిళ సినీ పరిశ్రమ పరిరక్షణ సమాఖ్య తరఫున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న చిన్మయి సంచనల వ్యాఖ్యలు చేశారు.

  యాసిడ్ దాడి చేస్తాం

  యాసిడ్ దాడి చేస్తాం

  2013లో నాకు జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడాను. ఆ సమయంలో నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా వైరముత్తు వ్యవహారాన్ని బయటపెట్టాను. ప్రస్తుతం నాపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. అయినే నేను బయపడను అని గాయని చిన్మయి అన్నారు.

  వైరముత్తుపై ఆరోపణలు చేస్తే

  వైరముత్తుపై ఆరోపణలు చేస్తే

  వైరముత్తుపై ఆరోపణలు చేస్తే అండగా నిలువాల్సింది కాకుండా నన్నే బాధిస్తున్నారు. అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ బాధితురాలినైన నన్నే అనుమానిస్తున్నారు. అప్పుడే ఎందుకు చెప్పలేదని వారు నిలదీస్తున్నారు. ఎవరెన్నీ మాట్లాడినా నా పంథాను విడువను. వైరముత్తుపై కేసు కూడా పెట్టబోతున్నాను అని చిన్మయి చెప్పింది.

  కోర్టుకు లాగుతానని

  కోర్టుకు లాగుతానని

  వైరముత్తును కోర్టు లాగడానికి తగిన ఆధారాలను సేకరిస్తున్నాను. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి ఇంట్లో లేదా పోలీసులకి చెబితే వాటిని పట్టించుకోరు. పైగా బయటకు రాకుండా అడ్డుకొంటారు. బాధిత మహిళలకు కామన్. సినీ పరిశ్రమలోనే కాదు.. ఇతర పరిశ్రమలోని మహిళల రక్షణ కోసమే మీటూ ఉద్యమం అని చిన్మయి ఉద్వేగంగా ప్రసంగించింది.

   చిన్మయికి సపోర్ట్.. సమంతకు ఝలక్

  చిన్మయికి సపోర్ట్.. సమంతకు ఝలక్

  లైంగిక వేధింపులను బయటపెట్టిన చిన్మయికి సమంత, తదితరులు బాసటగా నిలిచారు. ఈ విషయంలో సమంతకు చేదు అనుభవం ఎదురైంది. నీవు గొప్ప ప్రతిభావంతురాలైన నటివి. ఇప్పుడు వారికి బాసటగా నిలుస్తున్నావా? వాళ్లు బయటపెట్టనప్పుడు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఆమె లైంగిక వేధింపులకు గురైనప్పుడు ఎందుకు మాట్లాడలేదు. ఒకవేళ తనుశ్రీ ఇలాంటి దుర్మార్గాలను బయటపెట్టకపోతే మీరు నోరు మూసుకొని ఉండేవారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.

  English summary
  Singer Chinmayi gets threat from unkwon persons. Actor Samantha Akkineni was one of the first people to stand up for singer Chinmayi when she had accused lyricist Vairamuthu of sexual harassment. Samantha Akkineni responds to being trolled for supporting singer Chinmayi who called out lyricist Vairamuthu for sexual harassment.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more