»   » చిరు సూపర్ హిట్ బాలీవుడ్ రీమేక్ గా

చిరు సూపర్ హిట్ బాలీవుడ్ రీమేక్ గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి,వివి వినాయిక్ కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన ఠాగూర్ చిత్రం త్వరలో హిందీలోకి రీమేక్ అవబోతోంది.ఒరిజనల్ తమిళ చిత్ర దర్శకుడు ఎఆర్ మురగదాస్ ఈ చిత్రాన్ని హిందీలో చేయటానికి అక్కడ హీరోలను ఎప్రోచ్ అవుతున్నారు.అందులోనూ ఓ ప్రక్క అన్నా హజారే మూవ్ మెంట్ జరుగుతున్న నేపధ్యంలో కరప్షన్ కి వ్యతిరేకంగా తీసే సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని భావిస్తున్నారు.ఇక ఈ చిత్రం తమిళంలో రమణ టైటిల్ తో తెరకెక్కింది.విజయకాంత్ ఈ చిత్రంలో హీరోగా చేసారు.ఓ ప్రొఫెసర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటమే కథాంశంగా సినిమా రూపొందింది.అక్కడ విజయవంతమవటంతో తెలుగులో దాన్ని రీమేక్ చేసి హిట్ కొట్టారు.ఇప్పుడా చిత్రాన్ని కొంత మంది హిందీ స్టార్ హీరోలు చూడటం జరిగింది.అమీర్ ఖాన్,అక్షయ్ కుమార్,సల్మాన్ ఖాన్ వీరి లో ఒకరు హీరోగా చేసే అవకాసం ఉంది.గతంలో అక్షయ్ కుమార్ తో మురగదాస్ సినిమా చేసే అవకాసం ఉన్నా చాలా గ్యాప్ వస్తుందని భావించి సినిమా చేయకుండా మానేయటం జరిగింది.ఇప్పుడు మళ్లీ మురుగదాస్ తిరిగి బాలీవుడ్ లో సినిమా చేయటానికి సిద్దపడుతున్నారు.ఈ విషయమై మురగదాస్ మాట్లాడుతూ..రమణ చిత్రాన్ని హిందీలో చేసే అలోచన ఉంది.అయితే ఏది ఇంకా ఫైనలైజ్ కాలేదు.అక్షయ్ కుమార్ తో చిత్రం చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం సూర్య సినిమా రిలీజ్ బిజీలో ఉన్నాను అన్నారు.

English summary
Chirnjeevi's superhit flick Tagore in which he plays a college professor who turns vigilante when he loses his family due to acts of corruption, might be remade in Bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu