Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపు.. అగంతకుడి అరాచకంతో ..
తమిళ సూపర్‌స్టార్లకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగానే వస్తున్నాయి. అగంతకులు ఫోన్ కాల్స్ చేసి ఫలానా ఇంటిలో బాంబు పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి తుంటరి యువకులకు చెన్నై పోలీసులు గట్టిగా బుద్ది చెప్పినా ఇంకా అలాంటి అలవాట్లను మానుకోలేకపోయతున్నారు. తాజాగా చియాన్ విక్రమ్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాల్లోకి వెళితే..

విక్రమ్ ఇంటిలో బాంబు పెట్టామని ఫోన్
ఓ అగంతకుడు సోమవారం ఉదయం చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి బీసెంట్ నగరంలోని సూపర్ స్టార్ విక్రమ్ ఇంటిలో బాంబు పెట్టామని సమాచారం అందించాడు. దాంతో ఈ క్రమంలో విక్రమ్ ఇంటికి తిరువాన్మియార్ పోలీసులు చేరుకొని సోదాలు నిర్వాహించారు. బాంబ్ డిటెక్షన్, బాంబు విచ్చిన్నం చేసే స్వాడ్ అక్కడి చేరుకొన్నారు. అలాగే వేటకుక్కలను కూడా ఆ ప్రాంతానికి తీసుకు వచ్చి యుద్ధ ప్రాతిపదికన సోదాలు నిర్వహించారు.

డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల సోదాలు
అయితే విక్రమ్ ఇంటిని మొతాన్ని జల్లెడ పట్టినా బాంబుల ఆనవాళ్లు లభించకపోవడంతో బెదిరింపు కాల్స్ అని ధృవీకరించారు. ఆ తర్వాత ఏ మొబైల్ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. అగంతకుడు విల్లుపురం నుంచి కాల్ చేసినట్టు గుర్తించారు. అగంతకుడిని పట్టుకొనేందుకు పోలీసుల రంగంలోకి దిగారు.

గతంలో తమిళనాడు సీఎం ఇంటికి బెదిరింపులు
గతంలో తమిళనాడు సీఎం ఈ కే పళనిస్వామి ఇంటిలో బాంబు పెట్టినట్టు ఓ మతిస్థిమితం లేని యువకుడు కాల్ చేసి బెదిరించిన సంగతి తెలిసిందే. ఇలా పలువరు రాజకీయ నాయకులకు ఇలాంటి ఫేక్ కాల్స్ చెమటలు పట్టించడం పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది. ఆ తర్వాత కొందరు యువకులను పట్టుకొగా.. మానసిక స్థితి బాగాలేదనే విషయంపై వారిని వదిలి పెట్టడం జరిగింది.

విజయ్, అజిత్, సూర్యకు బెదిరింపు కాల్స్
ఇటీవల కాలంలో తమిళ సూపర్ స్టార్లు విజయ్, అజిత్, సూర్యకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే పోలీసులు రంగంలోకి దిగి ఆ కాల్స్ ఉత్తివే అని గుర్తించారు. అగంతకుల ఆచూకీ కనిపెట్టి కొందరిని అరెస్ట్ కూడా చేశారు. అయితే అగంతకుల కుటుంబ సభ్యలు అభ్యర్థన మేరకు వారిని ఆ వెంటనే వదలిపెట్టడం జరిగింది.

విక్రమ్ కెరీర్ ఇలా..
ఇక చియాన్ విక్రమ్ విషయానికి వస్తే.. రాజేశ్ ఎం సెల్వ దర్శకత్వంలో కోదండరాం కొండన్ చిత్రంలో చివరిసారిగా కనిపించాడు. ప్రస్తుతం ఆయన నటించిన కోబ్రా చిత్రం విడుదల కావాల్సి ఉంది. కోబ్రా చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీనిధి శెట్టి, దర్శకుడు కేఎస్ రవికుమార్, బాబు అంథోని, రోషన్ మ్యాథ్యూ, మృణాళిని రవి తదితరులు నటించారు.