»   » తమిళ అర్జున్‌రెడ్డిలో సూపర్‌స్టార్ కుమారుడు.. ఎంట్రీ ఇస్తున్న కుర్రోడు వీడే..

తమిళ అర్జున్‌రెడ్డిలో సూపర్‌స్టార్ కుమారుడు.. ఎంట్రీ ఇస్తున్న కుర్రోడు వీడే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ చిత్ర పరిశ్రమకు మరో వారసుడు పరిచయం కాబోతున్నాడు. తన విలక్షణ నటనతో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విక్రమ్ కుమారుడు ధ్రువ్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. తన కుమారుడి సినీ ప్రవేశంపై విక్రమ్ ఆదివారం అధికారికంగా ప్రకటన చేశారు. విక్రమ్ కుమారుడు ధ్రువ్ ఎంట్రీ ఇచ్చేది తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా కావడం విశేషం.

సోష్ మీడియాలో విక్రమ్

ధ్రువ్ యాక్టింగ్‌కు సిద్ధమవుతున్నాడు. తెలుగులో బ్లాక్ బస్టర్‌గా మారిన అర్జున్ రెడ్డి చిత్రంతో ధ్రువ్ సినీ ప్రవేశం చేస్తున్నాడు. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించే చిత్రంలో అర్జున్‌రెడ్డిగా కనిపించనున్నారు అని చియాన్ విక్రమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. తన కుమారుడికి సంబంధించిన ఓ వీడియోను కూడా తన అకౌంట్లో పెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.


ధ్రువ్ టాలెంటెడ్

ధ్రువ్ టాలెంటెడ్

ధ్రువ్ తండ్రి మాదిరిగానే టాలెంటెడ్. గతేడాది బాలలపై వేధింపులు అనే కాన్సెప్ట్‌తో షార్ట్ ఫిలిం తీశాడు. ఆ షార్ట్ ఫిలిం పేరు గుడ్ నైట్ చార్లీ. అంతేకాకుండా తన తండ్రికి కూడా సలహాలు కూడా ఇస్తున్నాడట. ఇరు మురుగన్ దర్శకత్వంలో వస్తున్న లవ్ సినిమాలో క్యారెక్టర్ కోసం కొన్ని మ్యానరిజమ్స్‌ను ధ్రువ్ నుంచి విక్రమ్ తీసుకోవడం విశేషం.


 అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్

అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్

తన కుమారుడి కోసం అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ కూడా తీసుకొన్నట్టు సమాచారం. అయితే అధికారికంగా అర్జున్ రెడ్డి నిర్మాత, డైరెక్టర్ నుంచి సమాచారం రావాల్సి ఉంది. అయితే ధ్రువ్‌తో అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తున్నారనే వార్త కోలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారింది.


 అర్జున్ రెడ్డి రీమేక్ కరెక్ట్

అర్జున్ రెడ్డి రీమేక్ కరెక్ట్

తెలుగులో అర్జున్‌రెడ్డి పాత్ర పోషించిన విజయ్ దేవరకొండకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అలాంటి పాత్రతో ధ్రువ్ ఎంట్రీ ఇవ్వడం సరైన నిర్ణయమేననే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. తండ్రి విక్రమ్‌లానే ధ్రువ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకొంటారని ఆశిద్దాం. ధ్రువ్‌కు తెలుగు ఫిల్మీబీట్ బెస్ట్ విషెస్ చెబుతున్నది.English summary
Tamil super star Chiyaan Vikram’s son Dhruv had been making the right noises about his intention to follow in the footsteps of his star father. And on Sunday, Vikram officially announced that his son will make his acting debut with the Tamil remake of Telugu blockbuster Arjun Reddy. “Ready to make the leap. Dhruv to be Arjun Reddy, on E4 Entertainment,” Vikram captioned a small video of Dhruv while sharing it on his Instagram account.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu