»   » ముఖ్యమంత్రి ప్రధానపాత్రలో 'లోక రాక్షసడు' చిత్రం

ముఖ్యమంత్రి ప్రధానపాత్రలో 'లోక రాక్షసడు' చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

భూ కుంభకోణంలో చిక్కుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప త్వరలో భూలోక రాక్షసన్ అవతారమెత్తనున్నాడు. 35 భాషల్లో రూపొందనున్న ఈ విభిన్న కథా చిత్రంలో ఆయన ఒక ముఖ్య పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారు. విజేష్ మణి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రకరకాల విశేషాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అత్యధిక భాషల్లో విడుదలైన సినిమాగా అవతార్(14) చిత్రానిదే రికార్డు. దాన్ని బద్దలు కొట్టే విధంగా భూలోక రాక్షసన్ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, ఒరియా, భోజ్‌పురి, మరాఠి, బెంగాలీ, గుజరాత్, కాశ్మీరీ, సిక్కిం తదితర భారతీయ భాషలతో పాటు ఆంగ్లం, అరబ్బీ, ఇరానీ, కొరియన్, చైనీస్, జపనీస్, సింహళం, నేపాలీ, స్పానిష్, ఫ్రెంచ్ వంటి 35 భాషల్లో తెరకెక్కి గిన్నిస్ రికార్డును సాధించడానికి సిద్ధం అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu