»   » నయనతార,అమలాపాల్ పై పబ్లిక్ గా మండిపడ్డ కమిడయన్

నయనతార,అమలాపాల్ పై పబ్లిక్ గా మండిపడ్డ కమిడయన్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: తను హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేయటానికి ఆసక్తి చూపలేదంటూ నయనతార,అమలాపాల్ పై మండిపడ్డాడు ప్రముఖ తమిళ కమిడియన్ కరుణ. ఆయన తాజా చిత్రం మచ్చన్ లో జోడి కోసం ఈ ఇద్దరు హీరోయిన్స్ ని సంప్రదించారు. అయితే వారు డేట్స్ ఖాళీలేవని తప్పించుకున్నారు. నయనతార అయితే చేయనని చెప్పేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో పంక్షన్ లో పబ్లిక్ గానే ఈ హీరోయిన్స్ పై అస్త్రాలు సంధించాడు ఈ హాస్య నటుడు.

  "ఇలా టాప్ హీరోయిన్స్ యాటిడ్యూడ్ చూపిస్తూంటే...నా లాంటి చిన్న హీరోలకు జోడి ఎవరు దొరుకుతారు..ఏం మేము హీరోలుగా చేయకూడదా...మా ప్రక్కన హీరోయిన్ పాత్రలు మంచిగానే తీర్చిదిద్దుతున్నామే..ఏమి వల్గర్ గా ఉండవే !"...అంటూ ఓ రేంజిలో ఆయన విమర్శలు గుప్పించారు. ఇక ఈ మచ్చన్ చిత్రంలో అతనిప్రక్కన శ్రీయల్ ప్రిటో అనే చిన్న స్ధాయి హీరోయిన్ చేస్తోంది.

  ఇక గతంలోనూ వడివేలు హీరోగా చేసేటప్పుడూ ఎవరూ ఆయన ప్రక్కన హీరోయిన్ గా చేయటానికి ముందుకు రాలేదు. అప్పుడు ఇలాంటి వివాదేమే జరిగింది. ఇక తెలుగులోనూ సునీల్ ప్రక్కన చేయటానికి ఏ హీరోయిన్ ఆసక్తి చూపటం లేదు. రాజమౌళి డైరక్టర్ అన్నా సరే సలోని ని తెచ్చుకోవాల్సి వచ్చింది. అనూష్కని అడిగితే చేయలేనని,డేట్స్ లేవని తప్పించుకుంది. నాగార్జున కూడా ఓ సారి తన ప్రక్కన హీరోయిన్ గా చేయటానికి ఓ అమ్మాయి ఆసక్తి చూపలేదని ఇంటర్వూలో చెప్పటం జరిగింది. అంతేకాదు బాలకృష్ణ వంటి హీరోకు సైతం తెలుగు స్టార్ హీరోయిన్స్ చేయటానికి ఆసక్తి చూపకపోవటమే..ఆయన సినిమాల్లో ఫేడవుట్ అయిన హీరోయిన్స్ సలోని,లక్ష్మిరాయ్ వంటి వారిని పెట్టాల్సి వస్తోందని గత కొంతకాలంగా వినిపిస్తున్న విషయమే.

  English summary
  Karunas who is playing the lead role in the Tamil flick 'Machan' found fault with Top Actress who weren't interested to team with actors like him. Reportedly, Nayantara and Amala Paul have been approached by the makers for the female lead in the film but both of them turned down the offer. At the audio launch of the movie, Karunas shot back,"If the top heroine show their attitude in this way, where could budding heroes get their female leads from!". As both the A-listers refused the proposal, Sheryl Pinto was casted as the leading lady to fill the glamour slot in the film which is said to be laugh riot.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more