కమెడియన్ వివేక్ పరిస్థితి విషమం.. రూమర్లకు తెర.. సిమ్స్ హాస్పిటల్ బులెటిన్ విడుదల
దశాబ్దకాలంగా దక్షిణాది ప్రేక్షకులను తనదైన హాస్యంతో ఆకట్టుకొంటున్న తమిళ నటుడు, కమెడియన్ వివేక్ గుండెపోటుకు గురి కావడం అభిమానులను, సినీ తారలను, సన్నిహితులను, స్నేహితులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. గుండెపోటుకు గురైన ఆయనను చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ (సిమ్స్)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వివేక్ ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ వర్గాలు విడుదల చేసిన బులెటిన్‌లో..

గుండెపోటుతో కుప్పకూలిన వివేక్
గుండెపోటుకు గురైన వివేక్ తన నివాసంలోనే కుప్పకూలిపోవడంతో స్విమ్స్ తరలించారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలుస్తున్నది. ఈ క్రమంలో హాస్పిటల్ బయట అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బులెటిన్ విడుదల చేశారు.

సిమ్స్ బులెటిన్ రిలీజ్ చేస్తూ..
వివేక్ ఆరోగ్య పరిస్థితిపై స్విమ్స్ తన ప్రకటనలో.. నటుడు పద్మశ్రీ,, డాక్టర్ వివేక్‌ను శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అపస్మారక పరిస్థితుల్లో హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ప్రత్యేక వైద్య నిపుణులు ఆయనకు ఎమర్జెన్సీ రూమ్‌లోని ఐ చికిత్స అందిస్తున్నారు అని తమ బులెటిన్‌లో స్విమ్స్ వర్గాలు పేర్కొన్నాయి.

ఎక్మో ద్వారా వివేక్‌కు చికిత్స..
స్విమ్స్ వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన తర్వాత, ఎమర్జెన్సీ కరోనరీ ఆంజియోగ్రామ్, ఏంజియోప్లాస్టీ చికిత్సను అందించారు. ప్రస్తుతం ఐసీయూలోని ఎక్మో ద్వారా వివేక్‌కు చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. అక్యుట్ కరోనరీ సిండ్రోమ్ ద్వారా ఏర్పడిన కార్డియోజెనిక్ షాక్. కోవిడ్ కోసం తీసుకొన్న ఇంజెక్షన్ ద్వారా వచ్చిన గుండెపోటు కాదు అని వైద్యులు తమ బులెటిన్‌లో స్పష్టం చేశారు.

రూమర్లకు తెరదించిన సిమ్స్ హాస్పిటల్
కోవిడ్19 కోసం తీసుకొన్న వ్యాక్సిన్ కారణంగానే వివేక్‌కు గుండెపోటు వచ్చిందనే రూమర్లు మీడియాలోను, ప్రజల్లోనూ వచ్చాయి. ఈ క్రమంలో స్విమ్స్ హాస్పిటల్ వర్గాలు ఈ రూమర్లకు తెర దించే ప్రయత్నం చేశారు. గురువారం (16వ తేదీన) చెన్నైలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో కోవిడ్ నివారణ కోసం వ్యాక్సిన్ తీసుకొని.. ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. వ్యాక్సిన్ తీసుకోవడం మంచింది.. ప్రాణాలను కాపాడుతుంది అని వివేక్ వెల్లడించారు.
Recommended Video

తల్లడిల్లుతున్న సినీ తారలు
కమెడియన్ వివేక్ గుండెపోటుకు గురయ్యారనే వార్తతో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వివేక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని కుష్బూ సుందర్, వెంకట్ ప్రభు, సిబి సత్యరాజ్ తదితరులు ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











