»   »  యాక్సిడెంట్, మహిళ తో గొడవ, హీరో సూర్య కొట్టాడని కేసు

యాక్సిడెంట్, మహిళ తో గొడవ, హీరో సూర్య కొట్టాడని కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ స్టార్ హీరో సూర్యపై పోలీసులకు ఓ ఫుట్ బాల్ ప్లేయిర్ కేసు పెట్టడం జరిగింది. ఓ రోడ్డు ప్రమాదం విషయంలో జోక్యం చేసుకుని బాధితుడునైన తనతో గొడవ పడి చేయిచేసుకున్నట్లు ఆయన చెన్నైలోని జే 5 శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రేమ్‌కుమార్‌ తన స్నేహితుడు టీ నగర్ లో ఓ బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్న లెనిన్ ఇమాన్యుయెల్(25)తో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు ఆద్యార్ ప్రాంతం మీదుగా వెల్తున్నారు. అలా వెళ్తున్న వారిని దాటుకుంటూ అకస్మాత్తుగా ఓ కారు వారి ఎదురుగా వచ్చి ఆగింది.దీంతో బైక్‌ స్కిడ్‌ అయి కారును ఢీకొంది.

నిర్లక్ష్యంగా కారు నడపడమే కాకుండా తమ బైక్ ధ్వంసానికి, గాయాలవడానికి కారణమైన ఆమెను నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆ వైపుగా నటుడు సూర్య వచ్చాడు. సూర్యా నివాసం కూడా ఈ ఆద్యార్ లోని ఉంది. సంఘటన జరిగిన చోటుకు అర కిలో మీటర్ దూరంలో సూర్య ఇల్లు ఉంది.

Complaint filed against Tamil actor Surya in case of 'assault'

అయితే, తాము ఆ మహిళను ఎంతో మర్యాద పూర్వకంగా నష్టపరిహారం అడుగుతున్నప్పటికీ సూర్య ఆ విషయంలో జోక్యం చేసుకొని మహిళని వేధిస్తారా అని తిట్టడంతోపాటు ఫుట్ బాల్ క్రీడాకారుడైన తన స్నేహితుడిపై చేయి చేసుకున్నాడని లెనిన్ చెప్పాడు.

అయితే, సూర్య అధికార ప్రతినిధి మాత్రం ఆయన అలాంటి తప్పు చేయలేదని, మహిళతో పద్ధతిగా ప్రవర్తించాలనే ఆ యువకులకు సూచించాడని చెప్పారు. ట్రాఫిక్ కూడా భారీ మొత్తంలో నిలిచిపోవడంతో వెంటనే వాదులాడటాన్ని విరమించుకొని వెళ్లిపోవాలని చెప్పి సూర్య వెనుదిరిగినట్లు చెప్పాడు.

English summary
A complaint has been filed against Tamil superstar Surya in an alleged case of assault, where he has been accused of attacking a youth who was having an altercation with a woman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu