»   » ఇళయరాజాకు అనారోగ్యం...అపోలో హాస్పటల్ లో

ఇళయరాజాకు అనారోగ్యం...అపోలో హాస్పటల్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు, మెస్ట్రో ఇళయరాజా (72) ఆసుపత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే విషయంపై వైద్యులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిచేదని ఆయనకు చెందినవారు చెబుతున్నప్పటికీ ఇళయరాజా ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Composer Ilayaraja hospitalised

1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో జన్మించిన ఇళయరాజ ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన నేడు భారతదేశ సంగీత ప్రముఖ దర్శకులలో ఒకరిగా ఎదిగారు..1976లో విడుదలైన జయప్రద నటించిన 'భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని 'చిన్ని చిన్ని కన్నయ్య" అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేసారు. తెలుగులో 'భద్రకాళి'కి తొలిసారి సంగీత దర్శకత్వం వహించినా, ఎన్టీఆర్‌ నటించిన 'యుగంధర్‌' మొదట విడుదలయింది.

నిత్య సంగీత సాధకుడుగా మన సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం ఆయనకు అలవాటు అయింది. దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన సంగీత నటరాజు ఇళయరాజ. ఇళయరాజ మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకోవడమేకాక, 2004లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

ఇళయరాజ సంగీతం వింటుంటే ఎవరైనా సరే అమాంతం తన్మయత్వం అయిపోవాల్సిందే. అంతటి ఘనత ఆయనది. ఆయన ఇప్పటి వరకు వేల పాటలకు, వందలాది చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన సుస్వరాలో తేలియాడని సంగీతాభిమాని ఉండరనడంలో అతిశయోక్తి కాదేమో!

English summary
Well-known musician Ilayaraja was admitted to a private hospital in Chennai , sources close to the composer said. Ilayaraja, 72, fondly addressed as 'maestro,' has been advised rest for a few days.
Please Wait while comments are loading...