»   » నాగచైతన్య డైరక్టర్ తో విక్రమ్ నెక్ట్స్ ఖరారు

నాగచైతన్య డైరక్టర్ తో విక్రమ్ నెక్ట్స్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నాగ చైతన్య తో గతంలో ఏమి మాయ చేసావే వంటి సూపర్ హిట్ ఇచ్చిన గౌతమ్ మీనన్ తన తదుపరి చిత్రానికి విక్రమ్ ని హీరోగా ఎంచుకున్నారు. ఐ' చిత్రం ద్వారా ఆకట్టుకున్న విక్రం ప్రస్తుతం'పత్తు ఎండ్రత్తుకుల్ల' చిత్రంలో నటిస్తున్నారు. 'గోలీసోడా' ఫేం విజయ్‌మిల్టన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మార్చి ఆఖరుకల్లా ఈ సినిమా పూర్తవుతుందని సమాచారం. ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా విక్రం తన తదుపరి చిత్రానికి కూడా సంతకాలు చేసినట్లు కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. 'ఎన్నై అరిందాల్‌'తో హిట్‌ను సొంతం చేసుకున్న గౌతంమేనన్‌.. విక్రం కోసం ప్రత్యేకించి ఓ స్క్రిప్ట్‌ రూపొందించారట. ఆ కథ విక్రంకు నచ్చడంతో నటించేందుకు అంగీకారం తెలిపారు. వీరి ప్రాజెక్టు కూడా ఏప్రిల్‌ ఆరంభం కానుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

స్త్టెలిష్‌ దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న గౌతంమేనన్‌ చిత్రంలో విక్రం నటిస్తుండటం ఇదే తొలిసారి. 'అపరిచితుడు' రెమో స్థాయిలో విక్రంను అందంగా ఇందులో చూపించబోతున్నారని కూడా ప్రచారం సాగుతోంది. అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

CONFIRMED: Vikram's Next Will Be Directed By Gautham Menon!

విక్రమ్ ప్రస్తుత చిత్రాల విషయానికి వస్తే....

రీసెంట్ గా విక్రమ్‌, ఎమీజాక్సన్‌ జంటగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐ'. తమిళంలో ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించిన ఈ సినిమాను మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నెగిటివ్ టాక్ మూట గట్టుుకన్నా...కలెక్షన్స్ పరంగా కొంచెం కూడా వెనకపడలేదు. తొలివారం కలెక్షన్స్ లో రికార్డుని క్రియేట్ చేసింది. డబ్బింగ్ చిత్రాల్లో రోబో చిత్రమే...రెవిన్యూ పరంగా టాప్ ప్లేస్ లో ఉండగా..ఇప్పుడు ఇది సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది.

అలాగే... ఓ కథని జడ్జిమెంట్ చేయటం ఎంత కష్టం...అందులో కోట్ల పెట్టుబడి, కెరీర్ ల మీద గేమ్ గా నడిచే సినిమా నిర్మాణంలో కీలకంగా నడిచే కథ అంటే చాలా చాలా కష్టం. అయితే తన కథని పది క్షణాల్లో హీరో విక్రమ్ ఓకే చేసారని గర్వంగా చెప్తున్నారు విజయ్ మిల్టన్.

సినిమాటోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన విజయ్‌మిల్టన్‌ 'గోలిసోడా'తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌లో చెన్నైలో సినిమాను తెరకెక్కించి.. భారీఎత్తున కలెక్షన్లు రాబట్టారు. ఏమాత్రం పెద్ద తారాగణం లేకుండా చిన్న పిల్లలతో సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఆ వూపుతో ఉన్న విజయ్‌మిల్టన్‌ ఇటీవల ఓ కథను విక్రంకు చెప్పి వినిపించారు. కథ చెప్పిన పది క్షణాల్లోనే విక్రం ఓకే చెప్పారట. ఆ కథే ఇప్పుడు '10 ఎండ్రత్తుకుల్ల'గా తెరకెక్కుతోంది.

CONFIRMED: Vikram's Next Will Be Directed By Gautham Menon!

విక్రంతో పరిచయం గురించి చెప్తూ... 'గోలిసోడా' చిత్రాన్ని సత్యం థియేటర్‌లో చూసి.. వెంటనే నాకు ఫోన్‌ చేశారు విక్రం. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మరి నాకు ఏదైనా మంచి కథ ఉందా?.. అని ఆ రోజు అడిగారు. నేనస్సలు నమ్మలేకపోయా. తప్పకుండా చెబుతా సార్‌ అన్నా. అలా మా ఇద్దరి సినిమాకు ఆ మాటలే బీజం అని ఆనందంతో వివరించారు.

విజయ్ మిల్టన్ మాట్లాడుతూ... దర్శకుడు కావాలన్నది నా ఆశ. కానీ చలనచిత్ర కళాశాలలో దర్శకత్వం కోర్సు చదవాలంటే డిగ్రీ తప్పనిసరి. కానీ అప్పట్లో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మూడేళ్లు చదివే అవకాశం కూడా లేదు. అందువల్ల ప్లస్‌టూ అర్హతతో ఛాయాగ్రాహకుడిగా చేరా. 1991లో కోర్సు పూర్తయ్యాక శక్తి శరవణన్‌, విన్సెంట్‌ సెల్వా వద్ద చేరా. అలా దాదాపు తొమ్మిది మంది వద్ద సహాయకుడిగా పని నేర్చుకున్నా. ఇప్పటి వరకు 25 చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశా. అన్ని సినిమాల్లోనూ దర్శకుడిగా నా ఆలోచన, పరిశీలనా దృష్టి మాత్రం ఉండేది అన్నారు.

అలాగే...ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నప్పుడు 'కాదల్‌', 'దీపావళి', 'దయా', 'వనయుద్ధం', 'హలో'.. వంటి చిత్రాలు నాకు చాలా పాఠాలు నేర్పాయి. ఎన్నో విషయాలను తెలుసుకున్నా. ఈ సమయంలోనూ ఓవైపు కథలు కూడా రాసుకునేవాడిని. ఏదోఒక రోజు మెగాఫోన్‌ పట్టాలనే తహతహలాడా. నాటి అనుభవం, నా ఆశలతో 'గోలిసోడా'కు దర్శకుడినయ్యా అన్నారు.

ఇక 'గోలిసోడా' అనుభవం గురించి చెప్తూ... ఖర్చు పెట్టిన సొమ్ము కన్నా 14 రెట్లు లాభం తెచ్చిపెట్టిందీ చిత్రం. తొలిరోజు 140 థియేటర్లలో విడుదలై.. కొన్ని రోజుల తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా మరో 60 థియేటర్లలో కూడా విడుదలైంది. అందులో తారలెవరూ లేదు. 5డీ కెమెరాతో తెరకెక్కించామంతే. మొత్తం ఓ 20 మందితో కథ నడిపాం. అతిపెద్ద అనుభవాన్ని మిగిల్చిన చిత్రం. నా కెరీర్‌ను వూహించని మలుపు తిప్పింది అన్నారు.

తదుపరి చిత్రం గురించి మాట్లాడుతూ... 'గోలిసోడా' తర్వాత అంతకు మించిన చిత్రం తీయాలన్నది నా కోరిక. అలా '10 ఎండ్రత్తుకుల్ల' అనే కథను సిద్ధం చేసుకున్నా. తొలిసారి ఆ కథ వన్‌లైన్‌ను విక్రంకు ఫోనలో చెప్పా. వెంటనే ఇంటికి రమ్మని చెప్పారు. కథ చెప్పిన వెంటనే.. పదే పది క్షణాల్లో నటిస్తానని ఒప్పుకొని నాలో ఆనందాన్ని నింపారు. అదే వేగంతో చిత్రీకరణ కూడా 90 శాతం పూర్తి చేశాం. క్లెమాక్స్‌, రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సమంత హీరోయిన్ అని చెప్పుకొచ్చారు.

English summary
Gautham Menon has moved on to his next. The director has, according to sources, narrated a script to Chiyaan Vikram who has apparently liked it. And so, the duo will be working together, soon.
Please Wait while comments are loading...