»   » హృదయాలు గాయపరిచాడు: కమెడియన్‌కు కోర్టు నోటీసులు

హృదయాలు గాయపరిచాడు: కమెడియన్‌కు కోర్టు నోటీసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాలకు మారు పేరైన తమిళ కమెడియన్ విడివేలు మరో వివాదంలో ఇరుక్కున్నారు. తమిళ సినీ నటుల సమాఖ్య 'నడిగర్ సంఘం'పై ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. విచారణకు హాజరు కావాలని కోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది.

ఇటీవల మదురైలో జరిగిన విలేఖరుల సమావేశంలో దక్షిణ భారత నటుల సంఘం కనిపించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విడి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న నామక్కల్‌ జిల్లా నడిగర్‌ సంఘం కార్యకర్తల సమిటీ సభ్యుడు, జిల్లా నాటక నటుల సంఘ అధ్యక్షుడైన ఆటో రాజా వడివేలుపై కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు.

Court issues summons to Vadivelu

వడివేలు చేసిన వ్యాఖ్యలు సినీ నటుల హృదయాలను ఆవేదనకు గురి చేశాయని, కావున ఆయనపై చర్యలు చేపట్టాలని పిటిషనలో కోరారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి 27వ తేదీన జరిగే విచారణకు వడివేల్‌ కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసు జారీ చేశారు.

గతంలోనూ వడివేలు అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఇటీవల నడిగర్ సంఘంకు జరిగిన ఎన్నికల్లో నాజర్, విశాల్ నేతృత్వంలోని జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీరి ఎన్నికపై వడివేలు అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

Read more about: vadivelu, వడివేలు
English summary
A local court on Friday issued summons to comedian Vadivelu for his alleged defamatory statement against the Nadigar Sangam during a press meet held at Madurai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu