twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గౌతమ్ మీనన్ కి షాక్...సినిమాలు తీయటం ఆపమన్న కోర్టు

    By Srikanya
    |

    చెన్నై: ఏమి మాయ చేసావే, ఎటో వెళ్లి పోయింది మనస్సు వంటి ప్రేమ కథలతో తనకంటూ తెలుగులోనూ క్రేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన కు తాజాగా చెన్నై సివిల్ కోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన తదపురి ఆర్డర్స్ వచ్చేవరకూ సినిమాలు చేయరాదని ఆదేశించింది. దానికి కారణం..ఆయన స్నేహితుడు జయరామన్ కోర్టులో వేసిన కేసే.

    వివరాల్లోకి వెళితే... జయరామన్... ఏమి మాయ చేసావే తమిళ వెర్షన్ నిర్మాతలలో ఒకరు..గౌతమ్ మీనన్ ప్రెండ్. ఆయన 2008లో తన బ్యానర్ లో ఒక సినిమా చేయమని నాలుగున్నర కోట్లు గౌతమ్ కి అడ్వాన్స్ గా ఇచ్చారు. అయితే దాన్ని వదిలేసి గౌతమ్ తన తదుపరి ప్రాజెక్టులలో పడిపోయారు. సూర్యతో తన తదుపరి చిత్రం ప్రకటించారు. ఇది చూసి కోపం తెచ్చుకున్న జయరామన్..గౌతమ్ పై కేసు వేసారు.

    ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉంది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని సెటిల్ మెంట్ చేసుకోవాల్సిందే కానీ కోర్టు ద్వారా తేలేదు కాదని అంటున్నారు. జయరామన్ మాత్రం చాలా పట్టుదలగా ఉన్నారు. గౌతమ్ మీనన్ తాను చేయనని అనలేదని, వాయిదా మాత్రమే వేసానని అంటున్నారు. ఏదైమైనా ఓ పెద్ద దర్శకుడుకి ఇలా జరగటం,సినిమాలు ఆగిపోవటం ఆయన అభిమానులను కలిచి వేస్తోంది.

    గతంలో గతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'చెలి', 'ఏ మాయ చేసావె' చిత్రాలు రెగ్యులర్ ప్రేమ కథా చిత్రాలే అయినా.... విభిన్నమైన ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో పాటు, డిఫరెంట్ క్లైమాక్స్ ఉండటం వల్లనే మంచి విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు తన తాజా సినిమా 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం విషయంలో మాత్రం గౌతమ్ మీనన్ కు ఎదురు దెబ్బ తగిలింది. భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫెయిల్ అయ్యింది. దాంతో వెంటనే పెద్ద హీరోతో చేసి మళ్లీ ఫామ్ లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నారు.

    English summary
    Chennai Civil Court barred director Gautham Menon from making any films till further orders. It is all started when Jayaraman,a producer filed petition against the director accusing of taking advance of Rs 4.5crs way back in 2008 to make a film. During that time Jayaraman teamed up to produce ‘Vinnaithandi Varuvaya’/ ‘Ye Maya Chesave’) in Tamil. However when Gautham announced a film with Surya without considering the promise made to Jayaram. This makes Jayaram get into frustration and his money got stuck up with the director Gautham Menon and by not returning the money, he lodged a complaint against Gautham Menon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X