»   » రాజమౌళి 'ఈగ' చిత్రానికి క్రేజీ మోహన్ తో స్పెషల్ క్రేజ్

రాజమౌళి 'ఈగ' చిత్రానికి క్రేజీ మోహన్ తో స్పెషల్ క్రేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి తాజా చిత్రం "ఈగ" తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ వెర్షన్ కు డైలాగులు కోసం క్రేజీ మోహన్ ని రైటర్ గా తీసుకున్నారు. తమిళంలో పాపులర్ కమిడియన్ మరియు, డైలాగు రైటర్ గా పేరుపొందిన క్రేజీ మోహన్ తో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. క్రేజీ మోహన్ ఎక్కువగా కమల్ హాసన్ చిత్రాలకు పనిచేస్తూంటారు. ఆయన పనిచేసిన బ్రహ్మచారి, తెనాలి, పంచతంత్రం చిత్రాలు కామిడీతో ఇక్కడ వారిని కూడా అలరించాయి. సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంధిల్ కెమెరా అందిస్తున్నాడు. 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.

English summary
Rajamouli’s crazy project ‘Eega’ is simultaneously being made in Telugu and Tamil languages. The film featuring Nani, Samantha and Sudeep in central roles went on sets recently. Tamil version are being penned by Crazy Mohan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu