»   » కాలా షూటింగ్‌లో విషాదం.. ఒకరి మృతి.. పోలీసుల దర్యాప్తు..

కాలా షూటింగ్‌లో విషాదం.. ఒకరి మృతి.. పోలీసుల దర్యాప్తు..

Written By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్, కబాలి దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో ప్రతిష్థాత్మకంగా రూపొందుతున్న కాలా కరికాలన్ చిత్రంలో విషాదం చోటుచేసుకొన్నది. షూటింగ్ సందర్భంగా ఎలక్ట్రిక్ షాక్ తగలడంతో చిత్ర యూనిట్ చెందిన ఓ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశత్తూ జరిగిందా లేక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసుల కేసును శోధిస్తున్నట్టు సమాచారం.

కాలా కరికాలన్ షూటింగ్‌లో ప్రమాదం

కాలా కరికాలన్ షూటింగ్‌లో ప్రమాదం

హాజీ మస్తాన్ జీవితం ఆధారంగా రూపొందుతున్నట్టు వార్తలు వస్తున్న కాలా కరికాలన్ చిత్ర షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతున్నది. ఎలక్ట్రిక్ షాక్ తగలి గురువారం మైఖేల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అతడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కానీ దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ మైఖేల్ మరణించాడు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పలు వివాదాల్లో కాలా సినిమా

పలు వివాదాల్లో కాలా సినిమా

కబాలి తర్వాత పా రంజిత్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఈ చిత్రం ప్రారంభానికి ముందే అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. హాజీ మస్తాన్‌ను కించపరుస్తూ సినిమా తీస్తే సహించేది లేదు అని గ్యాంగ్‌స్టర్ వారసుడు హెచ్చరించాడు. ఆ తర్వాత సినిమా కథ అంతా కల్పన. ఎవరి జీవితానికి సంబంధించింది కాదు.. ఎవర్నీ ఉద్దేశించి తీస్తున్నది కాదు అని దర్శకుడు పా రంజిత్ వివరణ ఇచ్చారు.

హాజీ మస్తాన్ జీవితం ఆధారంగా

హాజీ మస్తాన్ జీవితం ఆధారంగా

ప్రముఖ గ్యాంగ్‌స్టర్ హాజీ మస్తాన్ ముంబై నేర సామ్రాజ్యాన్ని శాసించిన సంగతి తెలిసిందే. ముంబైలోని ధారవి ప్రాంతంలో నివసించే తమిళ ప్రజల హక్కుల కోసం హాజీమస్తాన్ పోరాడాడు. గతంలో ఇదే తరహాలో భాషా చిత్రం 1995లో రూపొందింది. ఆ చిత్రం సాధించిన ఘనవిజయం అంతా ఇంతా కాదు. అదే తరహాలో మళ్లీ మాఫియా కథా నేపథ్యంగా కాలా రూపొందడం గమనార్హం.

నిర్మాతగా ధనుష్

నిర్మాతగా ధనుష్

వండర్ బార్ ఫిలిం బ్యానర్‌పై హీరో ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హ్యుమా ఖురేషి, నానా పాటేకర్, అంజలి పాటిల్, ఈశ్వరీ రావు, సముద్రఖని తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ రజనీకాంత్‌గా ధనుష్ నటించనున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

English summary
A crew member met with a fatal accident on the sets of superstar Rajinikanth's upcoming film, Kaala Karikaalan. According to a report in Deccan Chronicle, a worker named Michael stepped on a live wire on Thursday and was electrocuted. The Kaala Karikaalan team rushed him to the nearest hospital, but unfortunately could not save him. Reportedly, the incident is currently being investigated by the police.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu