»   » రజనీ ప్రజల మనిషి.. సీఎంగా చూడాలనుకోవడంలో తప్పేమీలేదు.. ధనుష్

రజనీ ప్రజల మనిషి.. సీఎంగా చూడాలనుకోవడంలో తప్పేమీలేదు.. ధనుష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళనాడు రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై భారీ ఎత్తున్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రజనీ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే చూడాలని అభిమానులు కోరుకొంటుండగా, మరికొందరు ఆయనపై ఇప్పటికే విమర్శలతో కత్తుల నూరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ ఆగమనంపై ఆయన అల్లుడు, సినీ హీరో ధనుష్ స్పందించారు. రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుందని ధనుష్ అన్నారు. వీఐపీ2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే..

రజనీ సార్‌కు ఏదనిపిస్తే అదీ చేస్తారు..

రజనీ సార్‌కు ఏదనిపిస్తే అదీ చేస్తారు..

తనకు రాజకీయాలంటే బొత్తిగా తెలియదు. వాటి గురించి మాట్లాడలంటే కష్టమే. కానీ రజనీ సార్‌కి ఏం అనిపిస్తే అది చేస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి కావాలనుకుంటే చాలా సంతోషం. రజనీ ఫ్యాన్స్ కూడా ఆయనను సీఎంగా చూడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు అని ధనుష్ అన్నారు.

Dhanush Playing Young Rajinikanth's Role in Kaala Movie | Filmibeat Telugu
రజనీ ప్రజల మనిషి

రజనీ ప్రజల మనిషి

రజనీకాంత్ నాకు మామ అయినప్పటికీ అది ఇంటికే పరిమితం. బయటకు వస్తే ఆయనను నేను సార్ అని సంబంధిస్తాను. రజనీకాంత్ ప్రజల మనిషి. బయట ప్రపంచంలో మాట్లాడేటప్పుడు సార్ అంటేనే గౌరవం ఉంటుంది అని అన్నారు.

భవిష్యత్‌లో అవకాశం వస్తే నటిస్తా

భవిష్యత్‌లో అవకాశం వస్తే నటిస్తా

నేను 30కి పైగా సినిమాల్లో నటించినప్పటికీ రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం దక్కలేదు. హిందీలో అమితాబ్‌తో నటించే అవకాశం దక్కింది. ఎందుకో రజనీతో కుదర్లేదు. అవకాశం లభిస్తే తప్పకుండా ఆయనతో నటిస్తాను అని ధనుష్ అన్నారు.

రిలీజ్‌కు సిద్ధమైన వీఐపీ2

రిలీజ్‌కు సిద్ధమైన వీఐపీ2

ప్రస్తుతం ధనుష్ వీఐపీ2 చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రం వీఐపీ1చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్నది. వీఐపీ2లో బాలీవుడ్ నటి కాజోల్ దేవగన్ కీలకపాత్రను పోషించింది. ఈ చిత్రానికి కథ, మాటలు ధనుష్ అందించడం గమనార్హం.

English summary
Hero Dhanush's latest movie is VIP2. This movie slated to release in August first week. Now He is busy with VIP2 promotion. In this occassion, Dhanush said that .. Rajinikanth is people's man. He deserve to enter in politics. Fans are eagrly waiting to see him as Chief Minister.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X