twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ తరహాలోనే తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టిన ధనుష్.. త్వరలోనే బిగ్ అప్డేట్

    |

    టాలీవుడ్ మార్కెట్ వాల్యూ రోజురోజుకు ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో మన హీరోలు దర్శకులు పవర్ఫుల్ గా రెడీ అవుతున్నారు. ఇక ఎప్పటి నుంచో తెలుగు మార్కెట్ పట్టు సాగిస్తున్న తమిళ హీరోల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. రజనీకాంత్ కమల్ హాసన్, సూర్య , కార్తీ వంటి వారు తెలుగులో ఎన్నోసార్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నారు.

    అయితే ప్రతిసారి డబ్బింగ్ సినిమా చేయడం కరెక్ట్ కాదని అప్పుడప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక ఈ మధ్య విజయ్ కూడా తెలుగులో మంచి క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో కంటే కూడా విజయ్ ఇటీవల సినిమా సినిమాకు తన వాల్యూ పెంచుకుంటూ వెళుతున్నాడు. మాస్టర్ సినిమాతో మరోసారి అది రుజువయ్యింది. దీంతో దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

    Danush special focus on tollywood market planing direct telugu movie

    ఇక ధనుష్ కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాడు.
    ధనుష్ కు తెలుగు జనాల్లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇంతవరకు సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఆ మధ్య వచ్చిన రఘువరన్ భీ.టెక్ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ధనుష్ తెలుగు మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగులోనే డైరెక్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అందుకోసం తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ ను అలాగే స్టార్ దర్శకుడిని సంప్రదించినట్లు సమాచారం. ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారట. మరి ఆ సినిమాతో ధనుష్ తెలుగు జనాలను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

    English summary
    No matter how many star heroes there are in Kollywood, the buzz coming to Dhanush movies will be different. No matter what movies are made, they are like Never Before. He makes sure that even if the film hits or flops, it will not have an impact on subsequent films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X