Just In
- 26 min ago
గుడ్ బై చెప్పాలనుకున్నా.. ఎన్టీఆర్, ప్రభాస్‌లతో! అసలు విషయం బయటపెట్టిన వెంకటేష్
- 54 min ago
మొత్తానికి ఫైనల్ చేశారు.. ఇక బాలకృష్ణ కష్టాలకు ఫుల్స్టాప్ పడినట్లేనా?
- 1 hr ago
‘జబర్ధస్త్’ కమెడియన్లపై జానీ మాస్టర్ సీరియస్.. కొరియోగ్రాఫర్ దెబ్బకు భయంతో వణికిపోయారు.!
- 2 hrs ago
వెంకీ మామ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ ఎలా ఉందంటే!
Don't Miss!
- News
Citizenship Bill:బీజేపీయేతర సీఎంలే దేశాన్ని కాపాడాలి..ప్రశాంత్ కిషోర్ ట్వీట్
- Finance
మహిళల కోసం సరికొత్త ఆలోచన: ఫుడ్ స్టార్టప్‌లో బాలీవుడ్ స్టార్ పెట్టుబడి
- Sports
ఐపీఎల్ వేలానికి తుది జాబితా ఖరారు: బెర్త్‌లు 73.. బరిలో 332
- Technology
అమెజాన్ నుంచి ఫైర్ టివి ఎడిషన్ స్మార్ట్
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 13-12-2019
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
రజనీ కోసం రంగంలోకి ఎస్పీబీ .. అదిరిపోతుందన్న అనిరుధ్
సూపర్ స్టార్ రజినీ కాంత్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో కలిసి దర్బార్ అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆపై తదుపరి ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టేశాడు. పోస్టర్స్, మోషన్ పోస్టర్స్‌తోనే హైప్ క్రియేట్ చేసిన దర్భార్.. థీమ్ మ్యూజిక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ మరో సంచలనాన్ని వదిలేందుకు సిద్దమయ్యాడు. తాజాగా దర్భార్ చిత్రం నుంచి ఓ అప్ డేట్ వచ్చేసింది.

నివేదా చేసిన ట్వీట్ వైరల్..
ఈ కథలో సూపర్ స్టార్ రజినీ కూతురుగా నివేదా నటిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేస్తూ.. ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.. ఒకే ఒక్కడు.. అతనే మా నాన్న.. ఆదిత్య అరుణాచలం.. అంటూ తెలిపింది. దీంతో సినిమాలో ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లే తెలుస్తోంది. ఈ మేరకు నివేదా చేసిన ట్వీట్ అప్పట్లో తెగ వైరల్ అయింది.

డబ్బింగ్‌కు ఫిదా అయిన దర్శకుడు..
రజనీ స్టైల్ మ్యానరిజం, డబ్బింగ్ చెప్పిన తీరుకు మురుగదాస్ మంత్రముగ్దుడైనట్టు కనిపిస్తోంది. డబ్బింగ్ పూర్తి చేసిన రజినీని ఉద్దేశించి.. నా లైఫ్‌లో ఇదే బెస్ట్ డబ్బింగ్స్‌లో ఇదొక్కటి.. తలైవార్ దర్బార్ డబ్బింగ్ పూర్తి అయిందంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి కూల్‌గా ముచ్చట్లు పెడుతున్న ఫోటోను షేర్ చేశారు.
|
గొంతు సవరించనున్న ఎస్పీబీ
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఈ మధ్య సినిమాలో పాటలు పాడటం చాలా వరకు తగ్గించేశాడు. ఏదో ఒకటి అరకొరగా పాడేయడం ఇష్టం లేని ఎస్పీబీ.. ప్రత్యేకంగా నిలిచే, ప్రాముఖ్యమున్న పాటలే పాడేందుకు సిద్దపడుతున్నాడు. ఈ మధ్య పలాస చిత్రానికి ఓ పాటను పాడాడు. మళ్లీ తాజాగా సూపర్ స్టార్ కోసం తన గొంతును సవరించేందుకు సిద్దమయ్యాడు.

రాబోతోన్న ఫస్ట్ సింగిల్
ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ పాటను ఎస్పీబీ ఆలపించగా.. వివేక్ సాహిత్యాన్ని అందించినట్లు తెలిపాడు. ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో నయనతార, నివేధా థామస్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.