»   » ప్లేబోయ్ హీరోకి చిక్కిన దీక్షాసేథ్

ప్లేబోయ్ హీరోకి చిక్కిన దీక్షాసేథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : కోలీవుడ్ లో ప్లే బోయ్ గా శింబు కు పేరు. ఆయన సరసన కొందరు హీరోయిన్స్ చేయటానికి ఉత్సాహం చూపిస్తూంటే ..మరికొందరు కంగారుపడుతూంటారు. అలాంటి సమయంలో ధీక్షాసేథ్ కు శింబు సరసన ఛాన్స్ వచ్చింది. ఆఫర్స్ లేని సమంయలో ఈ ఛాన్స్ రావటంతో ఇది గోల్డెన్ ఛాన్స్ అని ఆనందపడుతున్నారు. తమిళ మీడియా మాత్రం ప్లే బోయ్ చేతిలో పడిందే అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Deeksha Seth bags a biggie with Simbhu

ఇక శింబు నటించిన 'వాలు', 'ఇదు నమ్మ ఆళు' విడుదలకు ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం గౌతంమేనన్‌ దర్శకత్వంలో 'అచ్చం ఎన్బదు మడమైయడా'లో ఆయన నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ధనుష్‌కు చెందిన వండర్‌బార్‌ సంస్థ పతాకంపై రూపొందనున్న చిత్రంలో ఆయన నటించనున్నారు. శింబుకు జోడీగా దీక్షాసేథ్‌ సందడి చేయనున్నట్లు సమాచారం. ఆమె విక్రమ్‌కు జంటగా 'రాజబాట్త్టె'లో నటించారు. 'అచ్చం ఎన్బదు మడమైయడా' చిత్రీకరణ ముగిసిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది.

అల్లు అర్జున్...వేదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ.. దీక్షా సేథ్. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలతో రాణించిన దీక్షా, అడపదడపా తమిళంలోనూ నటించింది. ఇక తాజాగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టిన దీక్షాకు మొదటి సినిమాయే తీవ్ర నిరాశను మిగిల్చింది.
‘లేకర్ హం దీవానే దిల్' పేరుతో విడుదలైన ఆ సినిమా భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత దీక్షాకు ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పెద్దగా ఆఫర్లేవీ లేని ఆమెకు కోలీవుడ్‌లో వచ్చిన ఈ ఆఫర్ ..అద్బుతం క్రింద లెక్కే. మంచి ఆఫర్ వచ్చింది.

English summary
Deeksha has been roped in to play the female lead in Simbhu’s upcoming film in the direction of Selvaraghavan. This untitled flick has gone on floors recently and will showcase Simbu in a powerful role.
Please Wait while comments are loading...