»   » ఆ హీరోతో నాకేమీ విభేధాలు లేవు

ఆ హీరోతో నాకేమీ విభేధాలు లేవు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఓ విషయాన్ని మాత్రం క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నా. శివకార్తికేయన్‌ను హీరోగా చేయడానికి మాత్రమే నేను వండర్‌బార్‌ సంస్థను స్థాపించలేదు. అతనితోపాటు అనిరుధ్‌, స్టంట్‌మాస్టర్‌.. ఇలా చాలా మంది ఉన్నత స్థాయికి వెళ్లారు; వెళ్తున్నారు. కానీ శివకార్తికేయన్‌కు రెమ్యునేషన్ ఇచ్చేస్థాయి మా నిర్మాణ సంస్థకు లేదు. ఆయన ఆ స్థాయిని మించిపోయారు!.. అంటూ చెప్పుకొచ్చారు ధనుష్...ఆయన్ని... శివకార్తికేయన్‌ తో జరగుతున్న గొడవ విషయమై అడిగినప్పుడు ఇలా స్పందించారు.

అలాగే...ఓ నిర్మాతగా 'కాక్కాముట్టై' లాంటి సందేశాత్మక చిత్రాలను అందిస్తున్నా. త్వరలో విడుదల కానున్న 'విసారనై' చిత్రం కూడా సమాజాన్ని మేల్కొల్పే చిత్రమే. అలాగే అశ్విని అయ్యర్‌ దర్శకత్వంలో ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అమలాపాల్‌, రేవతి నటిస్తున్నారు అని చెప్పారు.

ధనుష్‌ ఇప్పటివరకు 30 పైచిలుకు చిత్రాల్లో నటించి బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మరో నాలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా హిందీలో కూడా మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు ధనుష్‌. మొన్న 'రాంజనా'.. ఇటీవల ఖషమితాబ్‌'తో మెప్పించి మురిపించారు. ప్రస్తుతం వేల్‌రాజ్‌ దర్శకత్వంలో 'వీఐపీ' చిత్రం తర్వాత ఖతంగమగన్‌'లో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో 'నవమన్మథుడు'గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 18వ తేదీన రెండుభాషల్లోనూ తెరపైకి రానుంది.

DHANUSH AND SIVAKARTHIKEYAN PATCH UP?

నవ మన్మధుడు' చిత్రం గురించి చెప్తూ... ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. నాన్నఅమ్మ, నాన్నకుమారుడు, మామకోడలు.. ఇలా తండ్రితో కుటుంబ సభ్యుల అనుబంధమే ఈ సినిమా. కేఎస్‌ రవికుమార్‌ తండ్రిగా నటిస్తున్నారు. దర్శకుడు ఎన్నిసార్లు వన్‌మోర్‌ టేక్‌.. అని చెప్పినా ఆయన ఏమాత్రం విసుగు లేకుండా నటించారు. ఎందుకంటే ఓ దర్శకుడి బాధ, అవసరం ఆయనకు బాగా తెలుసు కాబట్టి.

ఇక ప్రతి సినిమాకు భిన్నమైన కథను ఎంచుకోవడం ఆరంభం నుంచే తప్పకుండా పాటిస్తున్నా. 2006 నుంచి కుటుంబ, కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తున్నా. 'పొల్లాదవన్‌' పూర్తి మాస్‌. ఆ తర్వాత వచ్చిన ఖయారడీ నీ మోహిని' పక్కా ఫ్యామిలీ చిత్రం. ఇక 'పడిక్కాదవన్‌' కమర్షియల్‌.. ఆ తర్వాత ఖఉత్తమపుత్తిరన్‌' కుటుంబకథాచిత్రం. ఇలా వెరైటీ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నారు.

అలాగే...నిజజీవితంలో నేను పొగతాగను. సినిమాల్లో దర్శకుడు అడిగితేనే అలాంటి సన్నివేశాలు. మినహాయిస్తే ప్రత్యేకించి పొగతాగే, మద్యం సేవించే సన్నివేశాలను చేర్చను. ఇక.. దర్శకుడు అడిగితే పొగతాగే సినిమాల్లో తప్పకుండా నటిస్తా. ఎందుకంటే.. ఓ నటుడిగా దర్శకుడి మాటకు అడ్డుచెప్పడం నాకిష్టం లేదు.

నిజంగానే నా అభిమానులైతే వారు నా నిజజీవితంలోని స్టైల్‌ను ఫాలో చేస్తారు. అభిమానుల కోసమే 'వేలై ఇల్లా పట్టదారి' చేశా. అసలు ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థి పరిస్థితి ఏంటనేది?.. అందులో ప్రస్తావించాం. తప్పకుండా నా ప్రతి నాలుగు సినిమాల్లో ఒక సందేశాత్మక చిత్రం అందిస్తా అన్నారు.

'తంగమగన్‌' ప్రత్యేకతలేమిటంటే.... ఇది 'వేలై ఇల్లా పట్టదారి' చిత్రానికి సీక్వెల్‌ కాదు. దానికంటే భిన్నమైన కథతో రూపొందిన సినిమా ఇది. కేఎస్‌ రవికుమార్‌, రాధిక నాకు తల్లిదండ్రులుగా నటించారు. ఎమీజాక్సన్‌, సమంతలకు ఈ సినిమాతో మంచి గుర్తింపు లభిస్తుంది. పెళ్లికి ముందు, ఆ తర్వాత ప్రేమ, కుటుంబం, వినోదం.. వంటి పలు అంశాలతో కలగలసిన చిత్రమిది అన్నారు.

English summary
Dhanush made it amply clear that he and Sivakarthikeyan were like brothers and no bad blood existed between them, the former never spoke anything about it in public!
Please Wait while comments are loading...