»   » ధనుష్ మామూలోడు కాదు ఒక్క రోజులోనే అంతా చేసాడట

ధనుష్ మామూలోడు కాదు ఒక్క రోజులోనే అంతా చేసాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్న కథా చిత్రాల దర్శకుడు ప్రభు సాల్మన్ "నైవైలీ నుంచి ఘజియాబాద్ కు వెళ్లేందుకు పట్టిన రెండు రోజులు, ఒక రాత్రిప్రయాణంలో నాకెదురైన అనుభవాలే "తొడరి" అంటూ సినిమా మొదలు పెట్టిన విషయం తెలిసిందే కదా..!  ఆ సినిమా కోసంధనుష్ మామూలుగా కష్టపడటం లేదట, వేగంగా డబ్బింగ్‌ చెప్పడంలోనూ తన దూకుడు చూపించి వార్తల్లో నిలిచాడీ టాలెంటెడ్‌యంగ్‌ హీరో.

Dhanush, kirthi suresh

'తొడరి' కోసం సోమవారం డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టిన ధనుష్‌ 11 గంటలలోనే ఆ పనిని పూర్తిచేసి తన అంకితభావంతో చిత్ర యూనిట్‌ని  ఆశ్చర్యపరిచాడు. అంతే కాదు వెంటనే ఆవిషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

సామాన్యంగా స్టార్‌ హీరోలు తమ చిత్రాలకి డబ్బింగ్‌ విషయంలో రెండు, మూడు రోజుల సమయం తీసుకుంటారు. అలాంటిది ధనుష్‌ ఒక్క రోజు లోపే చెప్పడం యునిట్ మొత్తాన్నీ ఆశ్చర్యం లో ముంచేసింది. "'తొడరి' డబ్బింగ్‌ పూర్తిచేశాను. సినిమాచాలా బాగా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు కూడా (ప్రేక్షకులకు) నచ్చుతుందన్న నమ్మకం ఉంది" అని ధనుష్‌తన ట్విట్టర్‌ లో చెప్పాడు.

Dhanush,Sureshkirthi,thodari

మైనా, కుంకీ, కయల్ వంటి కథాబలం ఉన్న చిత్రాలను తెరకెక్కించిన ప్రభు సాల్మన్, ధనుష్‌ ల మొదటి ప్రాజెక్ట్ ఇది. 'నేనుశైలజ'సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కీర్తీ సురేష్ ధనుష్ కి జోడీ గా నటిస్తోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా పూర్తిగా ట్రైన్ జర్నీ నేపథ్యం లో సాగుతుందట. ఢిల్లీ నుంచి చెన్నై కి రైలు లో ప్రయాణం చేస్తున్న హీరో హీరోయిన్ల కు ఎదురైన సంఘటనలే ఈ తొడరి సినిమా కథ...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu