Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
దుమ్ము దులిపేసిన ధనుష్.. తమిళ్ లో టాప్ హీరో అనిపించుకున్నాడుగా!
తమిళ స్టార్ హీరోగా ఉన్న ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో జట్టు కట్టారు. ఒకరకంగా ధనుష్ ఇప్పుడు తమిళంతో పాటు హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన శేఖర్ తో కలిసి ఒక ట్రై లింగ్యువల్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎదురు చూస్తున్నానని అంటూ ధనుష్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఆయన వెంకీ అట్లూరితో కూడా సినిమా చేయబోతున్నారని అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ట్విట్టర్‌లో 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ సంపాదించిన తొలి తమిళ నటుడుగా ధనుష్ రికార్డులకు ఎక్కాడు.
ఇంత మంది ఫాలోవర్స్ వచ్చిన తొలి తమిళ నటుడుగా ధనుష్ రికార్డు క్రియేట్ చేశారు. ధనుష్ తనదైన నటనతో తమిళ భాషలో భారీ ఎత్తున అభిమానులను కలిగి ఉన్నారు. ఒక రకంగా ధనుష్ మల్టీ టాలెంటెడ్. దర్శకుడు, నటుడు, పాటల రచయిత, గాయకుడు మాత్రమే కాక నిర్మాత కూడా. ముఖ్యంగా మారి 2 సినిమాలో ఆయన చేసిన రౌడీ బేబీ పాట అయితే యూట్యూబ్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఇప్పటివరకు ఏ తమిళ సినిమా పాట 10 కోట్ల వ్యూస్ దాటలేదు. మొట్టమొదటిగా రౌడీ బేబీ పాట ఆ ఘనతను సంపాదించింది. ఇక అదే విధంగా, ట్విట్టర్లో అత్యధికంగా అనుసరిస్తున్న ప్రముఖుల జాబితాలో నటుడు ధనుష్ అగ్ర స్థానంలో నిలిచారు.

తమిళ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్న ధనుష్ కి ఇప్పుడు మొత్తం మీద ప్రస్తుతం 1 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చి చేశారు. దీంతో ధనుష్ అభిమానులు ట్విట్టర్‌లో #10MillionFollowersForDhanush అనే అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించబోయే తన 43వ చిత్రంలో ధనుష్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతోందని చెబుతున్నారు. ధనుష్ హిందీలో అక్షయ్ కుమార్ తో కలిసి 'అట్రాంగి రే' లో నటన పూర్తి చేసాడు. తెలుగులో దర్శకుడు సేకర్ కమ్ముల కొత్త చిత్రంలో నటించబోతున్నారు.