»   »  ధనుష్‌ ఆశలన్నీ ఆ డైరక్టర్ పైనే

ధనుష్‌ ఆశలన్నీ ఆ డైరక్టర్ పైనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : గతంలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘పొల్లాదవన్‌', ‘ఆడుగలం' చిత్రాల్లో ధనుష్‌ నటించారు. ఈ రెండు సినిమాలు ధనుష్‌ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. అంతేకాకుండా ధనుష్‌ను జాతీయ ఉత్తమనటుడిగా చేసింది ‘ఆడుగలం'. దీంతో

ప్రస్తుతం ధనుష్ తన ఆశలన్నీ వెట్రిమారన్‌పై పెట్టుకున్నారు. ప్రస్తుతం వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వడ చెన్నై' చిత్రంలో నటిస్తున్నారు. ఉత్తర చెన్నైకి చెందిన కథతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మూడు భిన్నమైన పాత్రల్లో ధనుష్‌ కనిపించనున్నారు.

Dhanush hope on Vetri Maaran's Vada Chennai’

ప్రస్తుతం ధనుష్‌ ‘కొడి' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘వడ చెన్నై'ని ఆరంభించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనులను ఆరంభించారు వెట్రిమారన్‌. త్వరలోనే ధనుష్‌ను కొత్తకోణంలో చూస్తారని చెబుతున్నారు వెట్రిమారన్‌.

వరుస విజయాలతో దూసుకెళ్లిన ధనుష్‌కు గత ఏడాది అంతగా అచ్చిరాలేదని చెప్పాలి. ఆయన నటించిన ‘మారి', ‘అనేగన్‌', ‘తంగమగన్‌' చిత్రాలు బాక్సాపీసు వద్ద చతికిలపడ్డాయి. అందువల్లే గత ఏడాది నేర్పిన పాఠాలతో ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలపై దృష్టిపెట్టారు.

English summary
Dhanush has committed over 200 days to shoot both the parts of ‘Vada Chennai’. The project will go to sets in January next year. Vetrimaaran requires over 7 months to complete the films .
Please Wait while comments are loading...