జగమే తంత్రం అంటోన్న ధనుష్.. అదిరిపోయిన మోషన్ పోస్టర్
అసురన్ చిత్రంలో మంచి ఫామ్‌లో ఉన్న హీరో ధనుష్.. పటాస్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా ఆ చిత్రాన్ని తెలుగులో లోకల్ బాయ్స్ పేరిట డబ్ చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే ధనుష్ తాజా మూవీ అప్‌డేట్ ఒకటి వచ్చింది. భిన్న చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరున్న కార్తీక్ సుబ్బరాజు వంటి యంగ్ డైరెక్టర్‌తో చేస్తోన్న మూవీ అప్‌డేట్‌ను ప్రకటించేశాడు.
జగమే తంత్రం అంటూ రాబోతోన్న ధనుష్.. ఈ మూవీలో కొత్తగా కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. మోషన్ పోస్టర్‌లో ధనుష్ లుక్, అప్పియరెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ ఒక్కటి అదిరిపోయాయి. తాజాగా మరో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమాను తెలుగు నాట గీతా ఆర్ట్స్, యూవీ సంస్థలు కలిసి డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సంతోష్ నారాయణ్ అందించే సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందని తెలుస్తోంది. ధనుష్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











