»   » వీఐపీ2 ఆలస్యానికి కారణం వెనుక అసలు రహస్యం: డబ్బులు కొల్లగొట్టటానికే ఎత్తుగడ

వీఐపీ2 ఆలస్యానికి కారణం వెనుక అసలు రహస్యం: డబ్బులు కొల్లగొట్టటానికే ఎత్తుగడ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ధనుష్' కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం 'వేలలై యిల్ల పట్టధారి' అటు తమిల్ లోనూ ఇటు తెలుగు లోనూ ధనుష్ కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకు సీక్వెల్ గా 'వీఐపీ 2' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 'కబాలి' నిర్మాత కలైపులి ఎస్‌.థాను నిర్మాతగా సౌందర్య రజనీకాంత్‌ రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు విడుదల తేదీల్లో మార్పు చేసినట్లు టాక్. 'ధనుష్‌' పుట్టినరోజు అంటే జూన్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించగా ఇందులో మార్పు చేసారట. ముందే చెప్పినట్టు వీఐపీ 2 ధనుష్ పుట్టిన రోజున రావటం లేదు.

జూలై 28 నాడు విడుదలకావలిసి ఉంది

జూలై 28 నాడు విడుదలకావలిసి ఉంది

విఐపి2 సినిమా ధనుష్ పుట్టిన రోజు నాడు అంటే జూలై 28 నాడు విడుదలకావలిసి ఉంది. కానీ ఏవో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వలన వాయుదా వేయవలిసి వచ్చింది అని ముందు చెప్పారు. కానీ అవి ఏవి వాస్తవాలు కావంట. ధనుష్ సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడటంతో అలాగే బాలీవుడ్ మాజీ హీరోయిన్ కాజోల్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించడంతో ఈ సినిమాను తమిళ్ తో పాటుగా తెలుగు హిందీలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బాక్స్ ఆఫీసు కలెక్షన్లు

బాక్స్ ఆఫీసు కలెక్షన్లు

కాజోల్ ఈ సినిమాలో నటించడంతో తమిళనాడులో మంచి ఆసక్తి ఏర్పడింది అలాగే హింది కాజోల్ అభిమానులు కూడా ఎలా చేసిందో ఏమి చేసిందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ధనుష్ కూడ రెండు హింది సినిమాలలో నటించడం వలన అక్కడ బాగనే ఆదరణ దక్కుతుందని.. విడుదల తేదీని మార్చారట. ఒకే సారి మూడు భాషలలో విడుదల చేస్తే బాక్స్ ఆఫీసు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండవచ్చు అని భావించి ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.

20 ఏళ్ల తరువాత తమిళ్ లో 'కాజల్'

20 ఏళ్ల తరువాత తమిళ్ లో 'కాజల్'

ప్రోస్టు ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న 'వీఐపీ 2'లో 'అమలాపాల్' హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటి 'కాజల్' ముఖ్యపాత్ర పోషించారు. దాదాపు 20 ఏళ్ల తరువాత తమిళ సినిమాలో 'కాజల్' నటిస్తుండడం పట్ల ధనుష్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల తేదీల్లో మార్పు చేసినట్లు సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు

సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు

ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ‘ధనుష్' అభిమానుల ఓపిక..సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని ప్రకటించారు. అయితే ఇలా ఒకేసారి మూడు బాషల్లో రిలీజ్ అంటూ ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజులో కాస్త ఎక్కువగా ఊహించుకుంటున్నాడేమో అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

English summary
Dhanush and Kajol's upcoming film Velaiilla Pattadhari 2 (VIP 2) will not release this month
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu