»   » రజనీకాంత్ ని దాటుతున్నాడు...హాలీవుడ్ కు బుక్కయ్యాడు

రజనీకాంత్ ని దాటుతున్నాడు...హాలీవుడ్ కు బుక్కయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నటుడుగా అంచెలంచెలుగా ఎదుగుతూ తమిళ చిత్ర పరిశ్రమకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్న ధనుష్‌ త్వరలోనే హాలీవుడ్‌ చిత్రంలో కనిపించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. పర్షియన్‌ దేశ దర్శకుడు మార్జెన్‌ త్వరలోనే 'రూమెయిన్‌ బ్యూడోల్స్‌' నావల ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దిల్లీ నుంచి ఫ్రాన్స్‌కు వెళ్లే ఓ యువకుడు దారిలో ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జరిగిన ఆసక్తికరమైన విషయాలే ఈ నవల. ప్రేమ, రొమాన్స్‌తో అక్షరాలద్దుకున్న ఈ నవల ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది. అధిక ప్రతులు అమ్ముడయ్యాయి కూడా. ఇందులో హీరోగా నటించడం కోసం ధనుష్‌ వద్ద దర్శకుడు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Dhanush in Marjane Satrapi’s Hollywood film?

అంతేకాకుండా ఆగ్లం మాట్లాడే ముగ్గురు నటుల వద్ద ప్రస్తుతం చర్చిస్తున్నట్లు ఇటీవల మార్జెన్‌ కేన్స్‌ చిత్రోత్సవాల్లో కూడా ప్రకటించారు. అసలు విషయం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

'ఆడుగలం' (పందెం కోళ్లు) చిత్రం ద్వారా ఉత్తమ జాతీయ నటుడిగా గుర్తింపు పొందారు ధనుష్‌. ఆ తర్వత పలు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వరించాయి. అనంతరం 'కొలవెరి..' పాటతో ప్రపంచ దేశాలకు పరిచయమయ్యారు. హిందీ చిత్ర పరిశ్రమలో 'రాంజనా'తో అడుగుపెట్టి కలెక్షన్ల వర్షం కురిపించారు. అంతేకాకుండా తాజాగా 'షమితాబ్‌'తో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు హాలీవుడ్ కు ప్రయాణం కట్టారు.

English summary
In the ongoing 68th Annual Cannes Film Festival being held at France, famed Persian writer and director Marjane Satrapi has revealed her idea of compressing a best selling novel into the big screen.
Please Wait while comments are loading...