ఈ మాస్ నటుడిని గుర్తుపట్టగలరా? ముతక పాత్రలో క్రేజీ హీరో పరకాయ ప్రవేశం..

Recommended Video

Dhanush Is Unrecognizable In The Latest Poster From Asuran || Filmibeat Telugu

ఇమేజ్ చట్రంలో బందీలై హీరోలు చాలా రకాలుగా ఇబ్బంది పడిన దాఖలాలు సినిమా పరిశ్రమలో ఎక్కువగానే కనిపిస్తాయి. కానీ అలాంటి వాటికి దూరమని ప్రతీ సినిమాతో హీరో ధనుష్ నిరూపిస్తుంటాడు. ఓ సినిమాకు మరో సినిమాకు చూపించే వేరియేషన్స్ ప్రేక్షకుల్లో ఆయనను విలక్షణ నటుడిగా మార్చాయి. నాలుగైదు దశాబ్దాలుగా రూపాంతరం చెందకుండా నటుడిగా రాణించే వాళ్లు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ధనుష్ పాత్ర కోసం పూర్తిగా మారిపోవడం షాక్ గురిచేస్తున్నది. ఇంతకు ఏ సినిమా కోసం ధనుష్ ఇలా మారాడంటే..

అసురన్‌గా ముతక పాత్రలో ధనుష్

అసురన్‌గా ముతక పాత్రలో ధనుష్

వడా చెన్నై సినిమా ఘన విజయం తర్వాత దర్శకుడు వెట్రిమారన్‌తో ధనుష్ మరోసారి జతకట్టాడు. ప్రస్తుతం అసురన్ అనే సినిమా కోసం జతకట్టారు. డార్క్, ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతున్న అసురన్ కోసం ముతక వేషంలోకి ధనుష్ పరకాయ ప్రవేశం చేయడం సినీ వర్గాలకు, ప్రేక్షకులను షాక్ గురిచేస్తున్నది.

క్రేజీ లుక్‌తో అదరగొట్టిన విలక్షణ హీరో

ఇటీవల విడుదలైన అసురన్ పోస్టర్ చూసిన వారాంతా ధనుష్ ఈ రేంజ్‌లో మారిపోయాడేంటి అనే మాట వినిపిస్తున్నది. గుబురు గడ్డం, దట్టంగా పెరిగిన మీసాలు, ముతక కాటన్ షర్ట్.. అచ్చు పల్లెటూరి దిగువ తరగతి రైతుగా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా షర్టుపై రక్తపు మరకలు ముతక పాత్రకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. సినిమా చివరి షెడ్యూల్ మొదలైంది అని ధనుష్ ట్వీట్ చేశారు.

ద్విపాత్రాభినయంతో ధనుష్

ద్విపాత్రాభినయంతో ధనుష్

అసురన్ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి, కొడుకులుగా రెండు పాత్రల్లో ధనుష్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభమైందని తెలుపుతూ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన కనిపిస్తున్నది. ధనుష్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తమిళంలోకి మంజు వారియర్ ఎంట్రీ

తమిళంలోకి మంజు వారియర్ ఎంట్రీ

అసురన్ చిత్రంలో మలయాళ నటి మంజు వారియర్ నటిస్తున్నది. ఈ చిత్రం ద్వారా ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల మంజు వారియర్‌తో కలిసి ధనుష్ డ్యాన్స్ చేస్తున్న వీడియో లీక్ అయి వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X