Jagame Thandhiram trailer.. లండన్ వీధుల్లో తమిళ్ గ్యాంగ్‌స్టర్ రచ్చ.. ధనుష్ నట విశ్వరూపం!

అసురన్, కర్ణన్ లాంటి విభిన్నమైన చిత్రాల్లో తన నటనతో అదరగొట్టిన విలక్షణ నటుడు ధనుష్ మరోసారి తన నట విశ్వరూపం చూపించేందుకు సిద్దమయ్యాడు. ఆయన నటించిన జగమే తాంధిరమ్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీంతో ప్రమోషనల్ కార్యక్రమాల వేగం పెంచారు. కరోనావైరస్ కారణంగా థియేటర్‌లో రిలీజ్ కాలేకపోయిన ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

జగమే తాంధిరమ్ చిత్రం ట్రైలర్‌ను చూస్తే మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనే ఫీలింగ్‌ను కలిగించింది. లండన్‌లో జరిగే మాఫియా, గ్యాంగ్ వార్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్టు అనిపించింది. ఇక ఈ చిత్రంలో వలసవాదులు అనే పాయింట్ ప్రధానంగా కనిపిస్తున్నది. శ్వేత వర్ణాలు, నల్ల జాతీయుల మధ్య జరిగే గ్యాంగ్ వార్‌ ఈ సినిమాకు హైలెట్‌గా మారే అవకాశం కనిపిస్తున్నది.

Dhanushs Jagame Thandhiram trailer released: Top trending in twitter

ఇక ట్రైలర్ చివర్లో పెద్ద తప్పు చేస్తున్నావంటూ ధనుష్‌ను తన సహచరుడు హెచ్చరించడం... అందుకు సమాధానంగా తప్పు చిన్నదా? పెద్దదా? అనేది పట్టించుకోకు అనే విధంగా ధనుష్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ట్రైలర్ చూసిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకొనేలా ఉంది. సీన్లను మరింత ఎలివేట్ చేసినట్టు అనిపించింది.

జగమే తాాంధిరమ్ మూవీ గురించి మాట్లాడుతూ..నెట్‌ఫ్లిక్స్ మాంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. తప్పకుండా ఈ సినిమాను టీవీలో చూసి ఆనందిస్తారు అంటూ ధనుస్ ట్వీట్ చేశారు.

ఇక జగమే తాంధిరమ్ చిత్రం జూన్ 18వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎస్ శశికాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X