»   » ‘బాహుబలి-2’ కంటే గొప్పగా ఆడుతుందని బెట్ కట్టిన చిత్రం ట్రైలర్ చూడండి

‘బాహుబలి-2’ కంటే గొప్పగా ఆడుతుందని బెట్ కట్టిన చిత్రం ట్రైలర్ చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నటుడి నుండి డైరెక్టర్ గా మారిన ధనుష్ తెరకెక్కించిన చిత్రం పవర్ పాండి . ప్రముఖ తమిళనటుడు రాజకిరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్, ప్రసన్న,రేవతి,ఛాయ సింగ్, విద్యేల్లేఖ రమన్ కీలక పాత్రలు పోషించారు. ధనుష్ డైరక్ట్ చేసిన చిత్రం సినిమా కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. వార్డ్ రోబ్ స్టూడియో బేనర్ పై రూపొందిన చిత్ర ట్రైలర్ ని తాజాగా విడుదల చేసింది మూవీ టీం. ఆ ట్రైలర్ మీరు చూడండి.

'పవర్‌ పాండి' చిత్రం ట్రెయిలర్‌ చూస్తే ఇది ఎంత డిఫరెంట్‌ సినిమా అనేది అర్థమవుతుంది. యాక్షన్‌, ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒక అరవయ్యేళ్ల హీరోని పెట్టి ధనుష్‌ చేసిన ఈ ప్రయోగానికి అందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. హీరోగా చాలా బిజీగా వుండి కూడా ప్యాషన్‌ కొద్దీ ఈ చిత్రానికి కథ రాసి, దర్శకత్వం వహించిన ధనుష్‌ ట్రెయిలర్‌తో ఆకట్టుకున్నాడు.

ఇటీవల చిత్ర ఆడియోని విడుదల చేయగా, ఆ పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం 64 ఏళ్ళ పాండి అనే వ్యక్తి జీవిత నేపథ్యంలో తిరుగుతుందని అంటున్నారు. రాజ్ కిరణ్ ఆ పాత్రకి చాలా న్యాయం చేసాడని చిత్ర యూనిట్ చెబుతుంది.

ఈ సందర్బంగా తమిళ పరిశ్రమలోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కె. రాజన్ ' నేను ధనుష్ అభిమానిని. ఆయన వరుసగా ఇచ్చినన్ని హిట్లు మరే హీరో ఇవ్వలేదు. ఆయన డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా గొప్పగా అందుతుందని నేను బెట్ కట్టి మరీ చెబుతాను. ఇంకా చెప్పాలంటే బాహుబలి 2 కన్నా దీని మీదే నాకు ఎక్కువ నమ్మకంగా ఉంది' అన్నారు. ఈ సినిమాని ఆకాశానికెత్తడానికి బాహుబలిని ఉదాహరణగా చూపిన ఆ డిస్ట్రిబ్యూటరే 'బాహుబలి-2' యొక్క తమిళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దక్కించుకున్నారు. 'పవర్ పాండి' ఏప్రిల్ 14న రిలీజ్ కానుండగా 'బాహుబలి-2' ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది

'పవర్ పాండి' చిత్రాన్ని ప్రెస్టీజ్ ఇష్యూగా భావిస్తున్నాడు ధనుష్. ఈ మేరకు ఇది తన కలల ప్రాజెక్టు అనీ తన కల నెరవేరేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అని ధనుష్ ఓ ప్రకటన కూడా చేశాడు. రాజకిరణ్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో ధనుష్, గౌతమ్ మీనన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారట.

English summary
The trailer of Dhanush's directorial debut 'Power Paandi' has been released.Rajkiran's name in the film is Paandian Pazhanisami, which justifies the titles change as well. The film under Wunderbar productions banner has a star cast that includes Dhanush, Chaya Singh, Rajkiran, Revathi, Prasanna, Dhivyadarshini, and Gautham Menon. Dhanush plays a cameo as the younger version of Rajkiran.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu